Rana:సమంత విషయంలో రానా ఇండైరక్ట్ కామెంట్ ?

By Surya PrakashFirst Published May 27, 2022, 4:55 PM IST
Highlights

‘నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఈ డైలాగుని సమంత ని ఉద్దేశించి చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అదే సమయంలో ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.  


నాగచైతన్య మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మనం సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లోనే నాగచైతన్య రెండవసారి చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం థాంక్యూ.  ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేసి,  చిత్ర యూనిట్ మళ్లీ ప్రమోషన్స్ డోస్ పెంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ అయ్యాక..జనం ఈ సినిమా కంటెంట్ గురించి మాట్లాడటం కన్నా ఈ సినిమాలో డైలాగు గురించి కామెంట్స్ చేయటంలో బిజీగా ఉంటున్నారు.

Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes https://t.co/9s6qhMpLCx

— Rana Daggubati (@RanaDaggubati)

‘నన్ను నేను సరి చేసుకోవటానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఈ డైలాగుని సమంత ని ఉద్దేశించి చెప్పినట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.  టీజర్ ను చూసిన టాలీవుడ్ హ్యండ్సం హంక్ రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పుకొచ్చారు. రానా క్యాజువల్ గా విషెష్ చెప్పినా ఈ కామెంట్ ని సైతం సమంత, చైతు డైవర్స్  మ్యాటర్ లో కలిపేస్తున్నారు.

రానా దగ్గుబాటి పెట్టిన పోస్టుపై ఓనెటిజన్   సందేహం వ్యక్తం చేస్తూ... ‘ఇక్కడేదో తేడా కొడుతుంది.. రానా అన్న ఇన్‌టెన్షన్.. సరి అయిపోయాడు (లైఫ్)లో అని’ ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరో నెటిజన్ సామ్‌ను వదిలిన దగ్గర్నుంచి సరి అయ్యాడా అని నవ్వుతున్న ఎమోజీలు పెడుతున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ సైతం  సామ్ మ్యాటర్‌లో సైలెంట్‌గా వేశావు.. అంటూ కామెంట్ చేస్తున్నారు. డు. మొత్తానికి నాగచైతన్యపై రానా వేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే రానా అసలు ఇదేమీ మనస్సులో పెట్టుకుని చెప్పి ఉండకపోవచ్చు..కానీ జనం ఎవరికి తోచినట్లు వాళ్లు అర్దాలు తీస్తున్నారు.

 రానా విషెస్‌పై హీరోయిన్ రాశీ ఖన్నా స్పందించింది. దీంతో రానా దగ్గుబాటికి థాంక్యూ చెప్పింది రాశీ ఖన్నా.  ఈ చిత్రం లో రాశి ఖన్నా(Raashi Khanna), అవికా గోర్, మాళవిక నెయిర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!