యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ.. టైటిల్ అదిరిపోయిందిగా..

By team teluguFirst Published May 27, 2022, 4:17 PM IST
Highlights

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో జోరు పెంచుతున్నారు. ఇప్పటికే మూడు చిత్రాల్లో నటిస్తుండగా.. తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా షురూ అయ్యింది. ఈ  సందర్భంగా దర్శకుడు క్రిష్ క్లాప్ కొట్టి, చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 
 

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మంచి గుర్తింపు  పొందిన ఈయన.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదుగుతున్నారు. కిరణ్ తొలిచిత్రం ‘రాజా వారు రాణి గారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానూ తెలుగు ఆడియెన్స్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇటీవల ‘సెబాస్టియన్ పీసీ 524’తో అలరించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో పెద్ద చిత్రాల సందడి ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కిరణ్ యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

అయితే ప్రస్తుం కిరణ్ వరుస చిత్రాల్లో నటిస్తూ జోరు పెంచుతున్నాడు.  ఇప్పటికే ‘సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మూడు చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తున్నాడు. తాజాగా మారో క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని ‘రూల్స్ రంజన్’ అనే క్రేజీ టైటిల్ ను ఖరారు చేశారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  

ఈరోజు చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. చిత్రం ప్రారంభోత్సవ  పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్  (Krish) హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శక, నిర్మాత ఏఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ రోజు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు. 

ఈ మూవీలో నటీనటులుగా వెన్నెల కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్, గోపరాజు రమణ, జెమినీ సురేష్, తులసి, మనోహర్ సింగ్ నటిస్తున్నారు. కో డైరెక్టర్ గా శ్రీకాంత్, కో ప్రొడ్యూసర్ గా రింకు కుక్రెజ వ్యవహరిస్తున్నారు. డీఓపీ బాధ్యతలను దులీప్ కుమార్ చూస్తుండగా, మ్యూజిక్ డైరెక్ట్ అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. 

click me!