హీరోగా దూసుకెళ్తున్న బిగ్‌ బాస్‌ 5 విన్నర్‌ సన్నీ.. మరో కొత్త సినిమా ప్రకటన..

Published : May 27, 2022, 04:30 PM ISTUpdated : May 27, 2022, 05:02 PM IST
హీరోగా దూసుకెళ్తున్న బిగ్‌ బాస్‌ 5 విన్నర్‌ సన్నీ.. మరో కొత్త సినిమా ప్రకటన..

సారాంశం

బిగ్‌ బాస్‌ 5 తెలుగు రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచారు వీజీ సన్నీ. తాజాగా వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. లేటెస్ట్ గా హీరోగా మరో సినిమాని అనౌన్స్ చేశారు.

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5) సీజన్‌ విన్నర్‌గా నిలిచారు వీజే సన్నీ(VJ Sunny). సైలెంట్‌గా వచ్చి సునామీ సృష్టించి టైటిల్‌ కొట్టేశాడు. ఈ రియాలిటీ షోతో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత కూడా కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు సన్నీ. హీరోగా వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. గతంలో ఏ బిగ్‌బాస్‌ విన్నర్‌ కి కూడా సాధ్యం కాని విధంగా సన్నీ సినిమా వరుసగా ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం. 

ఇప్పటికే ఓ సినిమాని స్టార్ట్ చేసిన సన్నీ, ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని, ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేస్తామని తెలిపింది యూనిట్‌. `సీమశాస్త్రి`, `పిల్లా నువ్వు లేని జీవితం`, `ఈడోరకం ఆడోరకం` వంటి చిత్రాలకు డైలాగులు అందించారు డైమండ్‌ రత్నబాబు. దర్శకుడిగా ఇప్పటికే ఆయన `బుర్రకథ`, `సన్నాఫ్‌ ఇండియా` చిత్రాలను రూపొందించారు. అంతేకాదు  రైటర్‌గా `షేర్‌`, `గాయత్రి`, `లక్కున్నోడు` చిత్రాలకు పనిచేశారు. దర్వకుడిగా మూడో సినిమా సన్నీతో చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

కమర్సియల్ అంశాలతో పాటు ఫ్యామిలికి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని యూనిట్‌ వెల్లడించింది. సన్నీకి జోడి కట్టే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక బిగ్‌బాస్‌ సన్నీ ఇప్పటికే `సకల గుణాభిరామ` అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రముఖ రైటర్‌ వెలిగొండ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఐపీఎల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సంజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ కూడా విడుదలై ఆకట్టుకుంది. త్వరలోనే ఇది థియేటర్‌లో విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు