"ఘాజీ"ని లాగేందుకు బైక్ ఎక్కిన రానా..

Published : Feb 09, 2017, 02:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
"ఘాజీ"ని లాగేందుకు బైక్ ఎక్కిన  రానా..

సారాంశం

ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి తయారైన బైక్ కొన్న రానా రానా నటిస్తున్న ఘాజీ సినిమా కథకు ఆధారం అదే కేవలం 70 వేలకే కొన్న బైక్ తనకు అత్యంత ఖరీదైందంటున్న రానా  

రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఘాజీ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను చారిత్రక నౌక ఘాజీపై తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నౌకకు సంబంధించిన అవశేషాలను బజాజ్ కంపెనీ తమ బైక్ ల తయారీకి వాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఈ నౌక అవశేషాలను కరిగించి కొత్త రూపమిచ్చి బైక్ లు తయారు చేసేందుకు వాడామని బజాజ్ సంస్థ ప్రకటనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

 

ఇంతకీ బజాజ్ కంపెనీ బైక్ కు... ఘాజీకి... రానాకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అదే విషయం. రానా రీసెంట్ గా బైక్ కొన్నాడు. అది కేవలం 70వేల రూపాయలతో. మరి 70వేల రూపాయల బైక్ కొనడం కూడా వింతేనా అంటే... ఆ బైక్ రానా స్థాయికి చిన్నదే అంటున్నారు కదా... కానీ ఆ బైక్ రానాకు ఎంతో ఇష్టంగా మారిందిప్పుడు. ఎందుకంటే రానా నటించిన ఘాజీ చిత్రం ఆ చారిత్రక నౌక ఆధారంగానే తెరకెక్కింది. ఆ నౌకను కరిగించి.. విడిభాగాలు తయారు చేసి బైక్ రూపొందించింది బజాజ్. ఆ బైక్ రానా కొనుక్కుని తెగ సంబర పడిపోతున్నాడు.

 

చారిత్రక నౌకకు సంబంధించిన సినిమాలో తను నటించడం. ఆ చారిత్రక నౌకకు సంబంధించి గర్వంగా చెప్పుకుంటున్న బైక్ కంపెనీ నుంచి తనూ ఓ బైక్ కొనుక్కోవడం అంతా.. తెగ ఆనందిస్తున్నాయి రానాకు. ఘాజీ ఏ రేంజ్ లో అలరించనుందో రిలీజ్ అయితేనే తెలిసేది. మొత్తానికి తన ఘాజీ సినిమా ప్రమోషన్ ను లాగేందుకు బైక్ ను కొనేశాడు రానా.

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?