రమ్యకృష్ణకు మరో పవర్ ఫుల్ రోల్

Published : Nov 29, 2016, 10:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రమ్యకృష్ణకు మరో పవర్ ఫుల్ రోల్

సారాంశం

మరో పవర్ ఫుల్ రోల్ దక్కించుకున్న రమ్యకృష్ణ శివగామి పాత్రలో రౌద్ర రసం పండించిన శివగామి

‘బాహుబలి’ సినిమాలో శివగామిగా సత్తా చాటిన రమ్యకృష్ణకు ఆ తరహా పాత్రలకు సంబంధించి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘థానా సెరంధ కూటం’లో రమ్యకృష్ణకు మరో విశిష్టమైన కీలక పాత్ర దక్కింది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్‌ అయ్యాయి.

దీనిని బట్టి ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ  ఇప్పటికే చేరినట్టు తెలుస్తోంది.  విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిసురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్‌, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది.

 

 బాలీవుడ్‌ సినిమా స్పెషల్‌ 26కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు గతంలో కథనాలు రాగా, వాటిని చిత్రయూనిట్‌ కొట్టిపారేసింది. వేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సూర్య ప్రతిష్టాత్మక సీక్వెల్‌ ‘సింగం-3’ రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్‌ 16న ఈ సినిమా విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్