
లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుని మూడేళ్ల నుంచి జెట్ స్పీడ్ తో బడా చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మూడేళ్లు దాటిన సందర్భంగా.. తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్తోంది. తన సోషల్ మీడియా ఎకౌంట్ లో రకుల్ పోస్ట్ చేసిన ట్వీట్ అమె అభిమానులను మరింత లైక్ చేసేలా కన్విన్స్ చేస్తోంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో నాన్నకు ప్రేమతో.., సరైనోడు...తదితర చిత్రాలతో అనతికాలంలోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నేటికి మూడు సంవత్సరాలు అయ్యింది.
ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ...ఈ జర్నీ ప్రారంభించి మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ జర్నీ చాలా అందంగా ఉంది అంటూ తన పై ప్రేమ చూపించి ఆదరించిన అందరికీ ధ్యాంక్స్ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. రకుల్ స్పందనకు ప్రతి స్పందనగా.... రకుల్ తో ప్రేమలో పడి అప్పుడే మూడు సంవత్సరాలు అయ్యిందా..? ప్రార్ధన ఇక్కడ...ప్రతి రూపాయి కౌంటే ఇక్కడ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో డైలాగ్ గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలియచేస్తున్నారు రకుల్ ఫ్యాన్స్..!