
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటించినప్పటి నుండి టీడీపీ నేతలకు కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. ఈ చిత్రంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగే సంఘటనలను చూపించబోతున్నానని వర్మ స్పష్టం చేశారు. దాంతో ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుండటంతో... వర్మ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీ నాయకులు ఆయనపై మాటల దాడి ప్రారంభించారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ లాంటి వాళ్లు తమ నోటికి పని చెప్పారు. అయితే వాళ్లకి తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.... తన సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచుకుంటున్నాడు ఆర్జీవీ. ఇక ఇదే కోవలో టీడీపీ ఎమ్మెల్యే అనిత తాజాగా వర్మపై విమర్శలు చేసే క్రమంలో... ఆమె మాట్లాడిన మాటలకు వర్మ షాక్ తిన్నారు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన వర్మ..."మీకు వచ్చిన ఐడియాలు షోలే రైటర్లు సలీమ్- జావేద్, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు కూడా వచ్చి ఉండవు" అంటూ అనితపై సెటైర్ వేశారు. అనితకు వర్మ ఇచ్చిన కౌంటర్ ఎటాక్ పై మీరూ ఓ లుక్కేయండి.
టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
అనిత గారు బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.
అనితగారు ఈ సినిమా బయోపిక్ కాదు..కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితం లో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.
అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు..జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..
అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు
టీడీపీ ఎమ్మెల్యే అనిత:
మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమజాహితo
ఆహా క్లాప్సు విజిల్స్ !!!
అంటూ వర్మ తన ఎఫ్.బి ఎకౌంట్ లో రిప్లై ఇచ్చారు. మొత్తానికి వర్మ అనుకున్నట్లుగానే జరుగుతుండటంతో.. టీడీపీ నేతలకు కౌంటర్స్ ఇస్తూ..హ్యాపీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ చేసేస్తున్నాడు వర్మ.