వీడెవడో నాలా పుట్టాడు.. విజయ్ దేవరకొండపై రామ్ గోపాల్ వర్మ

Published : Aug 23, 2017, 01:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
వీడెవడో నాలా పుట్టాడు.. విజయ్ దేవరకొండపై రామ్ గోపాల్ వర్మ

సారాంశం

సంచలనాలకు నిలయమైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఫ...అంటూ వ్యాఖ్యలు వీడెవడో నాలా పుట్టాడు అంటూ రామ్ గోపాల్ వర్మ కమెంట్స్ 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల సోషల్ మీడియాలో ట్విటర్ ఎకౌంట్ క్లోజ్ చేసి నేను నెటిజన్లకు దూరంగా వుంటానని చెప్పినా... వుండ బట్టలేక ఫేస్ బుక్ లో వీలు చిక్కినప్పుడల్లా.. పలు అంశాలపై స్పందిస్తూ వివాదాలకు అగ్గి రాజేస్తునే వున్నాడు. వివాదాల వర్మ ఈ వారం విడుదలకు సిద్ధమవుతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీపై తనదైన తీరులో స్పందించాడు. 

 

‘అర్జున్ రెడ్డి’ ఆడియో వేడుకలో హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ విన్నవారు అతడి పై రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందా అని కామెంట్స్ కూడ చేసుకున్నారు. ఈసినిమాలోని బూతులు కట్ చేసినందుకు సెన్సార్ బోర్డును టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ విన్నవారు అతడి ప్రసంగతీరు రామ్ గోపాల్ వర్మ స్టయిల్ లో ఉంది అంటూ కామెంట్స్ చేసుకున్నారు. 

 

ఈ కామెంట్స్ ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కొంచం ఆలస్యంగా  ఈసినిమా ట్రైలర్ గురించి స్పందించాడు. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ఈసినిమా హీరో విజయ్ దేవరకొండ చాలా విషయాల్లో తనను తలపిస్తున్నాడని అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను చావకుండానే అతను ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని తనదైన శైలిలో వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. 

 

అయితే ఈ కామెంట్స్ పై హీరో విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ ‘సార్ మీరు పుట్టకముందే నేను పుట్టడమే కాదు మీరు శివ తీసిన 1989వ సంవత్సరంలోనే నేను పుట్టాను’’ అంటూ బదులిచ్చాడు. ఇది ఇలా ఉండగా ఎల్లుండి విడుదల కాబోతున్న ఈసినిమా విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువే హైప్ వచ్చింది. ‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ  కు వచ్చిన క్రేజ్ వలనో మరి ఏ కారణం వలనో తెలియకపోయినా ఈ సినిమాకు ఏర్పడ్డ భారీ అంచనాలు అందరినీ  ఆశ్చర్య పరుస్తున్నాయి. దీనికితోడు కాంట్రవర్సీలు కూడ  తోడవడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉందని అంచనా.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం