
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”కి హాలీవుడ్ సపోర్ట్ కూడా లభించింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం మెగా అభిమానుల మధ్య సందడిగా జరిగింది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు వివధ వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే చిత్రం ఎలా వుండబోతోందన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేయగా అది ఇప్పుడు 200 కోట్లకు చేరుతోందని అంచనా వేస్తున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాను బాహుబలి రేంజ్ లో హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ హీరోగా నటించిన చిరంజీవి అక్కడి ప్రేక్షకులకు కొత్త కాదు. మరోవైపు కేంద్ర మంత్రిగా కూడా దేశమంతా చిరంజీవి సుపరిచితులు. దీనికితోడు సైరా నరసింహారెడ్డిలో కాస్ట్ అండ్ క్రూ కూడా అంచనాలకు మించి వుండటంతో సెట్స్ పైకి వెళ్లకముందే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం, నయనతార,జగపతిబాబు,కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి నటీనటులు వుండటం సినిమాకు బిజినెస్ పరంగా కలిసొచ్చే అంశాలు.
ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ దర్శకధీరుడు రాజమౌళి చేతులమీదుగా లాంచ్ చేయగా.. బాహుబలి సినిమా తరహాలో వుంటుందనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫస్ట్ లుక్ లో చిరంజీవి లుక్ కూడా అంచనాలకు మించి వుండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు హాలీవుడ్ కు చెందిన వెటా(WETA Studios) స్టూడియోస్ నుంచి మద్దతు లభించింది. మరి ఇప్పటికే అంచనాలు పెంచేసిన చిరు 151 రాను రాను ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.