శ్రీరెడ్డి కి ఆయన కూడా సెల్యూట్ కొట్టేశాడు

First Published Apr 13, 2018, 10:35 AM IST
Highlights
శ్రీరెడ్డి కి ఆయన కూడా సెల్యూట్ కొట్టేశాడు

శ్రీరెడ్డి కి  మద్దతాదారులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు అన్నది వాస్తవం. నిన్న కేంద్రం నుండి మద్దతు కూడా వచ్చేసింది దానికితోడు చాలా ఉద్యమ సంఘాల మద్దతు కూడా ఉండనే ఉంది.  ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తుంది.

శ్రరెడ్డిని మొదటి నుండి  పరిశీలిస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డికి సెల్యూట్ అనేస్తున్నాడు. 'సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి 100 ఏళ్ల వెనుక నుంచి ఉంది. కానీ ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా.. ఈ అంశాన్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకువచ్చిన శ్రీరెడ్డికి సెల్యూట్ చెబుతున్నారు. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయిన వారికి భయాలు కలుగుతున్నాయంటే అందుకు కారణం శ్రీరెడ్డి' అన్నాడు వర్మ.

'తన బట్టలు ఊడదీసుకుని శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసినపుడు తప్పు పట్టిన వాళ్లు అందరికీ నెమ్మదిగా విషయం బోధపడుతోంది. ఇప్పుడు ప్రాంతీయ మీడియానే కాదు.. నేషనల్ మీడియా కూడా మద్దతు పలుకుతోంది. ఓ నటిగా తన లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురైన ఇబ్బందులను అందరికీ చెప్పడంతో పాటు.. నటీమణుల ఇబ్బందుల విషయంలో శ్రీ రెడ్డి అఛీవ్ చేసిన విషయంపై.. ఆమె తల్లి కచ్చితంగా గర్వపడతారు' అంటూ ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.

click me!