ఏంజెల్ మూవీ రివ్యూ

Published : Nov 03, 2017, 08:48 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఏంజెల్ మూవీ రివ్యూ

సారాంశం

చిత్రం : ఏంజెల్ నటీనటులు : నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సప్తగిరి సంగీతం : భీమ్స్ సిసిరోలియో నిర్మాత : యోగీశ్వర్‌రెడ్డి దర్శకత్వం : ‘బాహుబలి’ పళని ఆసియానెట్ రేటింగ్: 2.75/5

శ్రీ సరస్వతి ఫిలింస్ బ్యానర్ పై నాగ అన్వేష్, బ్యూటిఫుల్ హిరోయిన్ హెబ్బా పటేల్ హిరోహిరోయిన్స్ గా దర్శకుడు పళని తెరకెక్కించిన చిత్రం ‘ఏంజెల్’. గ్రాఫిక్స్ తో ఎట్రాక్షన్ తీసుకొచ్చి ఫాంటసీ అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావటంతో అంచనాలు కూడా అంతే స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ శుక్రవారం విడుదలైన ఏంజెల్ సినిమా ఎలా వుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ: 

అమరావతి తవ్వకాల్లో ఒక అరుదైన శిలా విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా మరో చోటికి చేర్చమని నాని (నాగ అన్వేష్) గిరి (సప్తగిరి) లకు పిలుపు వస్తుంది. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిదంటే నక్షత్ర అనే ఒక గంధర్వ కన్యది. స్వర్గలోకంలోని గంధర్వరాజు కుమార్తె నక్షత్ర(హెబ్బా పటేల్) భూలోకానికి వెళ్లడానికి తన తండ్రిని ఎదిరించి మాట్లాడుతుంది. దీంతో అతడు శిలగా మారిపొమ్మని శపిస్తాడు. అయితే తనకు సంతోషం కలిగినప్పుడు ఆ శిల మనిషి రూపం ధరిస్తుందని గంధర్వరాజు చెబుతాడు. అలా శిలగా మారిన విగ్రహం అమరావతి తవ్వకాల్లో బయటపడుతుంది. దాన్ని అమ్మడానికి హరీష్(షియాజీ షిండే) బేరం కుదుర్చుకుంటాడు. దాన్ని హైదరాబాద్‌కు చేర్చమని నాని(నాగ అన్వేష్), అతడి స్నేహితుడు గిరి(సప్తగిరి)లకు చెబుతాడు. అయితే కొంత సమయం తరువాత ఆ విగ్రహం మనిషి రూపంలోకి మారుతుంది. అలా మారిన గంధర్వ కన్య నానితో ప్రేమలో పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది..? వారి ప్రేమ ఫలించిందా..? లేక నక్షత్ర తిరిగి తన లోకానికి వెళ్లిపోయిందా..? అనేది తెరపై చూడాల్సిందే! 

నటీనటులు :

ఈ సినిమాలో నాగ అన్వేష్ నటన పరంగా బాగానే చేశాడు. మొదటి సినిమాకి, ఈ సినిమాకు పరిణితి చూపించాడు. హెబ్బా పటేల్ కూడా తన పాత్రలో బాగానే నటించింది. లుక్స్ పరంగా కూడా అందంగా కనబడుతూ ఆకట్టుకుంది. హీరో స్నేహితుడిగా సప్తగిరి కామెడి బాగానే వర్కవుట్ అయింది. అది కాస్త నవ్వించింది. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కామెడీ ట్రాక్ వర్కవుట్ అయింది. కబీర్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం:

సోషియో పాంటసీ చిత్రానికి వుండాల్సిన అదనపు హంగులు పెద్దగా జోడించకుండా డైరెక్టర్ పళని కథనం సరిగా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు. ఇలాంటి కథలు హిట్ ఫార్ములానే కానీ దాన్ని చూపడంలో క్వాలిటీ లేకపోవడం దెబ్బతీసింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం కూడా అంతగా లేదు. నేపథ్య సంగీతం అక్కడక్కడ బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. గంధర్వ లోకంలో సన్నివేశాలు బాగా చిత్రికరించారు సినిమాటోగ్రఫర్. ఎత్నిక్ క్రియేటివ్ స్టూడియోస్ వారి సీజీ వర్క్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఒక గంధర్వ కన్య భూమి మీదకు రావడం, వేరొకరికి మంచి చేయాలని అనుకోవడం, అలా ప్రేమలో పడటం వంటి అంశాలు కథ పరంగా బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

హీరోయిన్ పాత్ర  బలహీనంగా ఉంది. గంధర్వ కన్య భూమి మీదకు రావడాలనుకోవడానికంటూ బలమైన కారణం అనేది లేకపోవడంతో కథలో పట్టు తప్పింది. హీరో హీరోయిన్ల మధ్యన లవ్ ట్రాక్ కూడా పట్టు తప్పింది. రొమాన్స్ అయినా పండి ఉంటే బాగుండేది. సప్తగిరి కామెడి కొన్ని సందర్భాల్లో నవ్వించినా కొన్ని సన్నివేశాలలో విసిగించాడు. స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ఫలితం కూడా తారుమారురైంది. ప్రతి నాయకుడ్ని కాసేపు సీరియస్ గా ఇంకాసేపు కామెడీగా చూపించే సరికి కథనంలో బలం తగ్గిపోయింది.

చివరగా :

నిర్మాణ విలువలు బాగానే వున్నా అనుకున్న కథను తెరపై మరింత ఆకర్షణీయంగా చూపిస్తే ఇంకా బాగుండేది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్