
ధృవ సినిమా తరువాత ఖైదీ నెంబర్ 150 మూవీతో మెగాస్టార్ రీ ఎంట్రీకి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మాతగా అందించిన రామ్ చరణ్ తిరిగి షూటింగ్ చేస్తున్న సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభించడానికి చాలా కాలం గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇటీవలే కొత్త సినిమా ప్రారంభించాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరిలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ గెటప్ రివీల్ చేసే ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గ్రీన్ కలర్ బనియన్, లుంగీతో ఉన్న చరణ్ లుక్ కి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు చరణ్ మాస్ సినిమాలు చేసిన ఈ రేంజ్ లుక్ లో మాత్రం ఎప్పుడు కనిపించలేదు. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మెగా పవర్ స్టార్ కెరీర్ లో స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. సమంత కూడా ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోందని తెలిసింది.