జగన్నాథం మాస్ కాదు.. ఊర మాస్

Published : Apr 09, 2017, 11:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
జగన్నాథం మాస్ కాదు.. ఊర మాస్

సారాంశం

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త లుక్ ఈ లుక్ తో అదరగొట్టిన దువ్వాడ జగన్నాథం సినిమాలో కేరక్టర్ ఊర మాస్, ఉతికి పారేసుడేనట

కలర్‌ఫుల్‌ స్కూటరూ... ఫుల్లుగా పంగ నామాలు పెట్టుకుని జగన్నాథమ్‌ గెటప్ లో అల్లు అర్జున్ హుషారూ... పూజలు, ముద్దులు, చిలిపి చేష్టలు...ఇలా అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌లో హీరో క్యారెక్టర్‌లో సాఫ్ట్‌ కార్నర్‌ను మాత్రమే ఎక్కువ చూపించారు. టీజర్‌ చివర్లో యాంగ్రీ అండ్‌ ఎమోషనల్‌ ఎక్స్‌ప్రెషన్‌ చూపించినా, డైలాగ్‌ మ్యూట్‌ చేయడంతో ప్రేక్షకులకు ఆ సీన్ ఎక్కిదో.. డైలాగ్‌ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి క్రియేట్ చేశారు.

 

ఆ సంగతలా ఉంచితే... జగన్నాథమ్‌ టీజర్‌లో చూపించినంత సాఫ్ట్‌ మాత్రం కాదట. కేరక్టర్ ఊర మాస్‌ అట! విలన్లను చితక్కొట్టే భారీ ఫైట్స్‌ కూడా సినిమాలో ఉన్నాయట. అందుకు సాంపిల్‌ గా అల్లు అర్జున్‌ బర్త్‌డే (శనివారం) సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్‌ దుమ్ములేపుతోంది. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

ఇక శనివారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్‌ కేక్‌ కట్‌ చేసి, పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. నాగబాబు, అల్లు శిరీష్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అల్లుఅర్జున్ వరుస హీట్స్ తో దూసుకెళ్తున్నా... పవన్ అభిమానులతో వైరం పెట్టుకున్నా... తాను ఎంత ఎదిగినా మెగా క్యాంప్ హీరోని మాత్రమేనంటూ వివరణ ఇచ్చేే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. ఇక పవన్ అభిమానులనూ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా అది అంతగా ఎఫెక్ట్ చూపలేదు.

 

PREV
click me!

Recommended Stories

Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..