డాడీ కోసం డబ్బును నీళ్లలా వాడేస్తున్నాడు!

By Prashanth MFirst Published Jan 19, 2019, 3:52 PM IST
Highlights

సైరా సినిమా పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నిర్మాత చరణ్.. తండ్రి సినిమాను అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో రాజీపడటం లేదు. 

మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా రూపొందుతున్న సైరా సినిమా పై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నిర్మాత చరణ్.. తండ్రి సినిమాను అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మిస్తున్నాడు. 

బడ్జెట్ విషయంలో రాజీపడటం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే చరణ్ డబ్బును మంచి నీళ్లలా వాడేస్తున్నాడు. అసలైతే సైరా సినిమా కథ పట్టాలెక్కినప్పుడు 100 కోట్లపైనే అవుతుందని ఒక నెంబర్ ని సెట్ చేసుకున్నారు. అనంతరం ముందుకు వెళుతున్న కొద్దీ సెట్స్ పై అలాగే గ్రాఫిక్స్ వర్క్స్ పై అంచనాను మిస్ అయిన చిత్ర యూనిట్ బడ్జెట్ ను 150 కోట్లకు పెంచేసింది. 

ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కి వచ్చేసరికి 200 కోట్లను దాటేసింది.; చరణ్ ప్రతిసారి పెంచుతున్నాడే గాని ఇంత ఎందుకు అని ఎక్కడా కూడా దర్శకుడిని ప్రశ్నించడం లేదట. కాకపోతే ఏ విధంగా ఎలాంటి మెటీరియల్ బెస్ట్ అనే విషయంలో చర్చలు జరిపి దర్శకుడిని అడిగిన దానికంటే చరణ్ కొంచెం ఎక్కువగానే ఖర్చు చేస్తుండడం విశేషం. 

ఇక రీసెంట్ గా లెక్కలకు వచ్చేసరికి బడ్జెట్ కాస్త 250 కోట్లకు టచ్ అవుతోంది.  ఇప్పుడు చరణ్ 1000 మందితో ఒక సాంగ్ ని ప్లాన్ చేశాడు. అసలైతే దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక వంద మంది డ్యాన్సర్ తో అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో సాంగ్ ను తెరకెక్కించాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ సినిమాలో ఇదే కీలకమైన పాట. దేశ భక్తికి సంబందించిన సాంగ్ కావడంతో సాంగ్ అదిరిపోవాలని ఏకంగా 1000 మంది డ్యాన్సర్లను తెప్పిస్తున్నారట. 

అలాగే మరో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు వేల మంది మధ్యలో సీన్ ను సిద్ధం చేస్తుండడం రికార్డ్ అని చెప్పాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే కానీ సైరా బడ్జెట్ 250 కోట్లను దాటేస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి చరణ్ ఖర్చు పెడుతున్న విధానం తెరపై ఎలా కనిపిస్తుందో తెలియాలంటే ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

click me!