ఫైనల్ గా మెగా ఎంట్రీ!

Published : Jan 19, 2019, 03:15 PM IST
ఫైనల్ గా మెగా ఎంట్రీ!

సారాంశం

మొత్తానికి మరో మెగా ఎంట్రీకి డేట్ సెట్టయ్యింది. మెగాస్టార్ రెండవ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బిజీ అవ్వడానికి ఎంతో సమయం లేదు. బడా ప్రొడక్షన్స్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు వైష్ణవ్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే.

మొత్తానికి మరో మెగా ఎంట్రీకి డేట్ సెట్టయ్యింది. మెగాస్టార్ రెండవ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బిజీ అవ్వడానికి ఎంతో సమయం లేదు. బడా ప్రొడక్షన్స్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు వైష్ణవ్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. 

అయితే ఫైనల్ గా ఆ కొత్త సినిమాకు ఈ నెల 21న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అనే యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. నానక్ రామ్ గూడలోని స్టూడియోలో లాంచింగ్ ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ఈ ఈవెంట్ లో పాల్గొని చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెస్ ని అందించనున్నాడు. 

వైష్ణవ్ తేజ్ గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ కి దగ్గరాగే ఉంటున్నాడు. సినిమాకు సంబందించిన వర్క్ షాప్ లో కూడా పాల్గొని నటనలో అలాగే డ్యాన్స్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. మరి ఈ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌