రామ్ చరణ్ తదుపరి చిత్రం బోయపాటితో...

Published : Aug 29, 2017, 05:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రామ్ చరణ్ తదుపరి చిత్రం బోయపాటితో...

సారాంశం

బోయపాటితో చేతులు కలపనున్న రామ్ చరణ్ రామ్ చరణ్ తదుపరి చిత్రం బోయపాటి డైరెక్షన్ లోనే.. ప్రస్థుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలంలో బిజీ

మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుల్లో ఇటీవల బోయపాటి శ్రీను దూసుకెళుతున్నారు. భారీ యాక్షన్ చిత్రాలు తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్ అయిన బోయపాటి జయ జానకి నాయక మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేయనున్నట్టు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇక తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే బోయపాటి ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటిస్తాడని తెలుస్తోంది.

 

బోయపాటి శ్రీను డైరెక్షన్ అంటే ఆ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ మొత్తంగా హీరోని చూపించే విధానం కానీ ఎలా వుంటుందో అందరికీ తెలిసిందే. అందుకే బోయపాటి శ్రీనుతో చెర్రీ సినిమా అనగానే మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్‌లోనూ ఆ సినిమాపై ఆసక్తి రెట్టింపయ్యింది. ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా షూట్‌తో బిజీగా వున్నాడు. రంగస్థలం పూర్తికాగానే చెర్రీ బోయపాటి డైరెక్షన్‌లో సినిమా చేస్తాడని సమాచారం.



అన్నట్టు బోయపాటి వద్ద చిరంజీవి కోసం కూడా ఓ కథ సిద్ధంగా వున్నట్టు ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా నుంచి రిలాక్స్ అవడానికి కనీసం ఎంత లేదన్నా మరో ఏడాది పడుతుంది కనుక ఈలోగా చెర్రీతో సినిమా వుండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా