
ఖైదీ నెంబర్ 150 తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ సైరా’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్.. అభిమానులను ఆకట్టకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
‘ఉయ్యాలవాడ...’కు ముగ్గరు భార్యలన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అంటే.. చిరు సరసన ముగ్గురు హీరోయిన్లు ఆడిపడతారన్న విషయం అర్థమౌతోంది. కాగా ప్రస్తుతం ‘ఉయ్యాలవాడ’ భార్యల పేర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పెద్ద భార్య పేరు సిద్ధమ్మ, రెండో భార్య పేరు పేరమ్మ, మూడో భార్య పేరు ఓబులమ్మ.
సిద్ధమ్మ పాత్రలో నయనతార, పేరమ్మ పాత్రలో అనుష్క, ఓబులమ్మ పాత్రలో బాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్లు సమాచారం. చిరు... ఈ ముగ్గరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. ఒక్కొక్కరితో ఒక డ్యూయెట్ సాంగ్ చేస్తాడని టాలివుడ్ టాక్. సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో కాబట్టి.. భార్యల పేర్లలో ఎలాంటి మార్పులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి కథ, డైలాగ్స్.. పరుచూరి బ్రదర్స్ అందిస్తున్నప్పటికీ వారిని కాదని బుర్రా సాయి మాధవ్ కి డాలగ్స్ రాసే బాధ్యత అప్పగించారట. అంతేకాకుండా స్క్రిప్టు లో మార్పులు చేర్పులు పతిరాజా, సత్యానంద్ లాంటి వాళ్లతో చేయిస్తున్నారట.
చివరగా ముగ్గరు భార్యలతో సైరా.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 2019 సంక్రాంతికి సందడి చేయనున్నాడు
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM