
అదిగో నిన్న ఇద్దరూ కూడా హిమాలయాల్లో ఉన్న రిషికేశ్ లో సేద తీరుతూ కనిపించారు. అక్కడ పరమార్ధ్ ఆశ్రమంలో ఉపాసన ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.. మన మైండులో ఆలోచనలు సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది అనే అంశంపై ఉప్సీ అక్కడ ఒక సెమినార్ నిర్వహించింది. ఆమెను ప్రోత్సహించడానికి రామ్ చరణ్ కూడా వెళ్లాడట.
ఇద్దరూ అక్కడే ఒక ఉద్యానవనంలో అలా సేద తీరుతూ తమ ప్రేమకథలో ఒక మాంచి రొమాంటిక్ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నారు కదూ. అయితే సుకుమార్ సినిమా చేయాల్సిన చరణ్ ఇలా రిషికేశ్ లో టైమ్ స్పెండ్ చేస్తుంటే.. ఇంక సినిమా ఎప్పుడు మొదలెడతాడూ.. ఎప్పుడు రిలీజవుతుంది.ఆ తరువాత మరో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? చరణ్ కే తెలియాలి.