అనుప‌మ ప్రేమ‌లో ప‌డిందా

Published : Mar 02, 2017, 05:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అనుప‌మ ప్రేమ‌లో ప‌డిందా

సారాంశం

శతమానం భవతి మూవీ ఫేమ్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌లో ప‌డింద‌ట‌ బావామరదళ్ల క్యారేక్ట‌ర్ తో ఎలాంటి సినిమా తీసిన హిట్ అవ్వాల్సిందేటంటున్న ముద్దుగుమ్మ‌ అనుపమ కొంపదీసి ఎవరితోనన్నా ప్రేమలో పడిందా ఏమిటి అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

 

 ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫుల్ లెంగ్త్ లో నటించిన సినిమా శతమానం భవతి. ఈ సినిమాలో హీరో శర్వాతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అదే అడిగితే బావామరదళ్ల క్యారెక్టర్లు కదా ఆ మాత్రం వర్కవుట్ అవ్వకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నించింది కూడా.

ఇదిలా వుంటే ఈ మలయాళీ అమ్మడు ఇటీవల యూట్యూబ్ లోకి వదిలిన ఓ వీడియో ఇప్పటికి రెండు లక్షలకు పైగా హిట్ లు తెచ్చేసుకుంది. ఇంతకీ ఏమిటీ వీడియో అంటే.. శతమానం భవితిలోని 'నాలో నువ్వు, నీలో నేను' పాటకు డబ్ స్మాష్ అన్నమాట.

 సరే ఆ పాటకు సినిమాలో నటించింది కాబట్టి అలాగే మళ్లీ మరోసారి నటించింది అనుకుంటే పొరపాటే. ఆ పాట, దాని సాహిత్యం, దాని ప్రతిపదార్థం అన్నీ తెలుసుకుని, మనసుతో స్పందించి, మొహంలోకి ఆ భావాలు అన్నీ తీసుకువచ్చి మరీ వీడియో చేసింది. ఇది చూసిన అందరూ అనుపమ కొంపదీసి ఎవరితోనన్నా ప్రేమలో పడిందా ఏమిటి? ఇంతలా ఫీలైపోతోంది అని గుసగుసలు పోతున్నారు

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్