రంభ తిరిగొస్తోంది..

Published : Nov 18, 2016, 03:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రంభ తిరిగొస్తోంది..

సారాంశం

త్వరలో అందాల నటి రంభ రీ ఎంట్రీ రంభ ఎప్పుడు తిరిగొస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ డాన్స్ షో తో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన రంభ  

90ల్లో టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలిగొందిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. అగ్ర హీరోలందరితో నటించిన అనుభవం ఆమెది. అందానికి తగ్గ అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిరుతో సమానం స్టెప్పులేసి అలరించింది. అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్  హీరోయిన్ గా వెలిగింది. దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది.

 

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి భాషల్లో నటించింది. రీసెంట్  పాస్ట్ లో తారక్, బన్నీ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెరుపులు మెరిపించింది. పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది.  చాలా కాలం తర్వాత రంభ టాలీవుడ్ కి తిరిగొస్తోంది.అయితే అది వెండితెరపైకి కాదు.. బుల్లితెర మీద. ఓప్రైవేట్ చానల్ లో ప్రసారం కానున్న డ్యాన్స్ షోకి ఆమె గెస్ట్ గా వ్యవహరించనుందంట. రంభ రీఎంట్రీ ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె ఫ్యాన్స్ కు నిద్ర కరువు చేస్తోంది. స్మాల్ స్క్రీన్ పై ఆమెను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఆది సాయికుమార్‌ కి సాలిడ్‌ బ్రేక్‌
Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!