
ప్రస్తుతం గౌతమ్ మీనన్ చూపు సాయిధరమ్ తేజ్ పై పడింది. తెలుగులో వెంకటేష్ ,నాగచైతన్య,నాని లతో పని చేసిన గౌతమ్ ఇప్పుడు తేజూతో పని చేయాలని చూస్తున్నానన్నాడు. ఇప్పటికే అతడిని ఓ భారీ మల్టీస్టారర్ కి ఎంపిక చేసాడు కూడా. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం తర్వాత ప్రస్తుతం ధనుష్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తునన్నాడు గౌతమ్ మీనన్. ఈ చిత్రం పూర్తైన తర్వాత తెలుగు,తమిళ,మళయాల,కన్నడ భాషల్లో కలసి భారీ చిత్రాన్ని తీయనున్నాడు.అనుష్క కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ మూవీ తెలుగు వర్షన్ లో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తేజూ తో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఏమాయచేసావే,సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల తర్వాత చైతూతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్. ఈమూవీతో తమిళంలో కూడా కూడా చైతూకి మార్కెట్ ఏర్పడేలా చేస్తాడట. అయితే చైతూ, తేజ్ లలో ఎవరితో గౌతమ్ మీనన్ ముందు చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.