మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ధృవ

Published : Nov 18, 2016, 01:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
మెగా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ధృవ

సారాంశం

ధృవ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ప్రస్తుతం థీయేటర్లలో సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ సిచ్యువేషన్ లో సినిమాను రిలీజ్ చేయాలావద్దా అనే మీమాంసలో ఉన్నారట దర్శకనిర్మాతలు.

బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ధృవ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు రామ్ చరణ్. మెగా హీరోల్లో ప్రస్తుతం చెర్రీ మాత్రమే కాస్త డల్ గా ఉన్నాడు. అందుకే ధృవతో బాక్సాఫీస్ నుషేక్ చేయాలని చూస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ కావడం, తెలుగులో గీతా ఆర్ట్స్  బ్యానర్ లో తెరకెక్కడం, అరవింద్ స్వామి విలన్ గా కనిపించడం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. హిప్ హాప్ తమిజా అందించిన పాటలు టాలీవుడ్ వీధుల్లో దుమ్మురేపుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేలా చేసాయి. 

 

నిజానికి ధృవ దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ అరవింద్ స్వామి అనారోగ్య కారణాల వల్ల సినిమా లేట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ ఈ విడుదల తేదీకి సినిమా రిలీజ్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో సినిమా ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ ఇస్తారట దర్శకనిర్మాతలు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌