Ramajogayya Shastri : ‘సిరివెన్నెల’ రాసిన పాటపై ‘రామజోగయ్య’ కామెంట్.. ఆయన రాసినవన్నీ గొప్ప పాటలైతాయా..!

By team teluguFirst Published Jan 27, 2022, 2:38 PM IST
Highlights

టాలీవుడ్ లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలకు ఎంతో మంది అభిమానులు మురిసిపోయారు. ఇటీవల తన రాసిన ఓ పాటను విన్న  లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సిరివెన్నెలను గుర్తు చేస్తూ స్పందించారు. 
 

తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సును కదిలించిన లెజెండ్రీ లిరిసిస్ట్, దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటల మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ఓ మూవీకి రాసిన  ఓ పాటపై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించారు. ఆ పాటలోని  మాధుర్యాన్ని తన కామెంట్ ద్వారా తెలియజేశారు. 

టాలీవుడ్ హీరో శర్వానంద్, అక్కినేని అమల నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీలోని ఇటీవల మదర్ సెంటిమెంట్ గల ‘అమ్మ’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు లిరిక్స్ ను లెజెండరీ లిరిసిస్ట్, దివంగత సిరివెన్నెల సీతారామశా స్త్రి అందించారు. ఈ సాంగ్ లో  తల్లి అవసరాన్ని తన ప్రత్యేకతను  గురించి కొడుకు తెలియజేస్తుంటాడు. తల్లే లేకుంటే ఏ కొడుకైనా ఏం చేయగలడనే నేపథ్యంలో సాగుతుందీ పాట. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబంధించిన లిరికల్ సాంగ్ య్యూటూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 

గొప్పపాటలన్నీ
ఆయన్ని వెతుక్కుంటూ వెళతాయా
లేక
ఆయన రాసినవన్నీ గొప్ప పాటలయిపోతాయా 🙏🙏🙏🙏🙏

One of last Gems of Guruji
Sirivennela Seetharama Sastry garu .https://t.co/5dCDXIz2QW

— RamajogaiahSastry (@ramjowrites)

అయితే, ఈ పాటపై రామజోగ్య శాస్త్రి స్పందిస్తూ ‘గొప్ప పాటలన్నీ ఆయన్ని వెతుక్కుంటూ వెళతాయా... లేక ఆయన రాసినవన్నీ గొప్ప పాటలయిపోతాయా..?’ అంటూ  సిరివెన్నెల సాహిత్య ప్రతిభను పొగుడుతూ పేర్కొన్నాడు.  మరోవైపు గురువుల్లో చివరి రత్నంగా మిగిలిపోయారని సిరివెన్నెలను గుర్తు చేసుకున్నాడు. ఆయన సాహిత్యానికి పొంగిపోయిన జోగయ్య నమస్కారాలు తెలియజేశాడు. 

కాగా, సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రధాన పాత్ర ధారుడిగా శర్వానంద్ నటిస్తుండగా, తల్లి పాత్రలో అమల అక్కినేని నటిస్తున్నారు. శర్వానంద్ కు జంటగా రీతూ వర్మ ఆడిపాడనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. 
 

click me!