Upasana Konidela:వివాదమైన ఉపాసన ట్వీట్‌ ,మండిపడుతున్న హిందువులు

Surya Prakash   | Asianet News
Published : Jan 27, 2022, 01:52 PM IST
Upasana Konidela:వివాదమైన ఉపాసన ట్వీట్‌ ,మండిపడుతున్న హిందువులు

సారాంశం

తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసన పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంతకాలం తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనాపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణమైన ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.  


 మెగాస్టార్ చిరంజీవి   కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూంటారు.ఆరోగ్యంతో సహా అనేక  అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.. ఆరోగ్య జాగ్రత్తలతో పాటు, సామాజిక అంశాలపైనా ప్రజలను చైతన్యం చేస్తుంటారు.  ఆమె.. తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నారు. ఆమె చేసిన ఓ ట్వీట్  చాలా మందికి నచ్చటం లేదు. హిందువులు  ఆమెపై దుయ్యపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసన పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంతకాలం తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనాపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణమైన ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.

జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన చేసిన పోస్టే ఈ దుమారానికి కారణం అవుతోంది..  ఓ పెద్ద గుడి గోపురంపై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేశారు. గుడిగోపురం పై సూక్ష్మ రూపంలో కొందరు ప్రజలు నిలుచుని ఉన్న ఆ ఫొటోలో “తానూ, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని, ఎక్కడ ఉన్నామో కొనుక్కోండి” అంటూ ఉపాసన తన ఫాలోయర్స్ ని కోరారు.

అక్కడితోనే ఆగని ఆమె.. ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని.. అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసనా రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. ఇంత వరకు ఆమె పోస్టులకు పాజిటివ్ కామెంట్స్ చేసేవారంతా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

ఈ ట్వీట్ లో గుడి గోపురం పైన దేవుళ్ళ ఫోటోల బదులు, సినీ స్టార్స్ బొమ్మల ఉండటం గమనించవచ్చు.  దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్ల నుంచే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఉపాసన పై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు ఇటువంటి ఫొటోస్ పెట్టి మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి, ఈ పోస్ట్ మీరు షేర్ చేశారంటే మీకు హిందూ దేవుళ్ళ పై ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది అంటూ.. కామెంట్స్  చేస్తున్నారు నెటిజన్లు.

ఈ ఫొటోలో సినిమా స్టార్స్ అందరు గుడి గోపురం పై చెప్పులతో నిలుచున్నట్టుగా ఎడిట్ చేశారు. నెటిజన్లు విమర్శిస్తున్నా ఉపాసన ఈ పోస్ట్ డిలీట్ చేయకపోవడం గమనార్హం.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..