
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )దూకుడు చూపిస్తున్నారు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కించడంతో పాటు.. వరుసగా అప్ డేట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మెగా పవర్ స్టార్ .
ట్రిపుల్ ఆర్ (RRR) కోసం మూడేళ్ళు త్యాగం చేశారు రామ్ చరణ్(Ram Charan ). 2019 లో వినయ విధేయ రామ సినిమా తరువాత మెగా హీరో నుంచి సినిమా రాలేదు. ఇకలేటు చేయకుండా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు చరణ్. ఫ్యాన్స్ తో ఈసారి గ్యాప్ లేకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే చరణ్ ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కు రెడీగా ఉంది ఈ సమ్మర్ వరకూ ఈసినిమా రిలీజ్ అవ్వడం ఖాయం.
ఇక ఈ సినిమా తరువాత ఏప్రిల్ లోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజివి( Chiranjeevi) తో కలిసి నటించిన ఆచార్య కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల హాడావిడిని చూస్తూనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్(Ram Charan ). ఈసినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు టీమ్.
రామ్ చరణ్(Ram Charan ) ఫ్యాన్స్ కోసం భారీ ట్రీట్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. అందువలన ఆయన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈసినిమా నుంచి చరణ్ (Ram Charan ) పుట్టిన రోజైన మార్చి 27వ తేదీన సర్ ప్రైజీంగ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.
అంతే కాదు ఈమూవీలో భారీగా యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. శంకర్ మార్క్ యాక్షన్ సీన్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిందే. దాని కోసం ప్రత్యేకంగా 70 కోట్ల వరకూ బడ్జెట్ ను కేటాయించబోతున్నట్టు సమాచారం. భారీ ఛేజింగ్ లు.. రామ్ చరణ్(Ram Charan) ఎలివేషన్ సీన్స్ కోసం కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుసోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ కోసం ఇంత ఖర్చు చేయబుతన్నట్టు సమాచరాం. దీని కోసం స్పెషల్ ప్లానింగ్ కూడా రూపొందిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్.
ఈ భారీ బడ్జెట్ సినిమా లో చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) అలరించనుంది. గతంలో ఆమె రామ్ చరణ్(Ram Charan ) జోడీగా వినయ విధేయ రామలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ తో చేయడానికి సుకుమార్ .. గౌతమ్ తిన్ననూరి లైన్లో ఉన్నారు