తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

పెళ్లి రూమర్ రావడంతో అనుమానించిన రామ్‌ పోతినేని మదర్‌.. షాకైన ఎనర్జిటిక్‌ స్టార్.. అసలేం జరిగిందంటే?

Aithagoni Raju | Updated : Jul 12 2022, 03:26 PM IST

సినిమా రిలీజ్‌ ప్రమోషన్‌లో పాల్గొన్న రామ్‌ మీడియాతో మాట్లాడుతూ, పెళ్లిపై స్పందించారు. జనరల్‌గా హీరోలపై వచ్చే పుకార్లుని పట్టించుకోను. ఫ్యామిలీ కూడా లైట్‌ తీసుకుంటుందన్నారు. కానీ..

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని(Ram Pothineni)పై పెళ్లి వార్తలు ఆ మధ్య వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఓ చైల్డ్ వుడ్‌ ఫ్రెండ్‌ని, స్కూల్‌ మేట్‌ లవ్‌లో పడినట్టు పుకార్లు గుప్పుమన్నాయి. ఇటీవల దానిపై క్లారిటీ ఇచ్చిన రామ్‌.. తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. మ్యారేజ్‌ రూమర్‌ రావడంతో ఇంట్లో ఏం జరిగిందో తెలిపారు. రామ్‌ పోతినేని ప్రస్తుతం `ది వారియర్‌` (The Warrior Movie)చిత్రంలో నటించారు. కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈచిత్రానికి లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రం ఈనెల 14న తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది. 

సినిమా రిలీజ్‌ ప్రమోషన్‌లో పాల్గొన్న Ram మీడియాతో మాట్లాడుతూ, పెళ్లిపై స్పందించారు. జనరల్‌గా హీరోలపై వచ్చే పుకార్లుని పట్టించుకోను. ఫ్యామిలీ కూడా లైట్‌ తీసుకుంటుంది. కానీ ఈ సారి మాత్రం అందరికి డౌట్‌ కొట్టింది. చిన్నప్పుడు చైల్డ్ వుడ్‌ స్వీట్‌ హార్ట్ ఎవరనేది ప్రశ్నించడం ప్రారంభించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా మాకు తెలియకుండా ఎప్పుడు ఈ స్టోరీనడిపించావ్‌ రా అంటూ అనుమానించడం స్టార్ట్ చేశారు. 

మా అమ్మ అయితే ఏకంగా `ఏం లేకుండానే ఇలా రాస్తారంటావా?` అనే అనుమానం వ్యక్తం చేయడంతో షాకయ్యాను. నేను స్కూల్‌కే రెగ్యూలర్‌గా వెళ్లలేదు. ఇక అమ్మాయితో ప్రేమలో ఎలా పడతానని ఆమెకి అసలు విషయం వివరించడంతో అమ్మ రియలైజ్‌ అయ్యిందని చెప్పారు రామ్. అందుకే తాను వెంటనే దీనిపై స్పందించి ట్వీట్‌ పెట్టానని చెప్పారు రామ్. అయితే పెళ్లి రూమర్‌ వచ్చినంత మాత్రాన పెళ్లి చేసుకోరని, దానికి టైమ్‌ ఉందని తెలిపారు. ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే అని వెల్లడించారు. 

ఇక `ది వారియర్‌` సినిమా గురించి చెబుతూ, తాను డిఫరెంట్‌ స్టోరీతో కూడిన పోలీస్‌ స్టోరీ చేయాలనుకుంటున్నప్పుడు లింగుస్వామి ఈ కథ చెప్పారు. అయితే రెగ్యూలర్‌గానే ఉంటుందో అనుకుని `నో` చెప్పాలనుకునే స్టోరీ విన్నానని, కానీ వినే క్రమంలో చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కచ్చితంగా చేయాల్సిన సినిమా, ఇలాంటి స్టోరీ లింగుస్వామి చేతిలో పడితే వేరేలెవల్‌లో ఉంటుందని నమ్మి ఈ చిత్రం చేశానని తెలిపారు. 

ఫెయిల్యూర్‌లో ఉన్న లింగుస్వామితో సినిమా చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, పరాజయాల్లో ఉన్నాడని అనుకుంటే `ఇస్మార్ట్ శంకర్‌` వచ్చేది కాదని, పూరీతో సినిమా చేసేవాడిని కాదని తెలిపారు. లింగుస్వామి బ్రిలియంట్ డైరెక్టర్‌ అని చెప్పారు. చాలా రోజులుగా తమిళంలో సినిమా చేయాలని భావించారట రామ్‌. చాలా కథలు విన్నానని, ఏదీ ఎగ్జైటింగ్‌గా అనిపించలేదని, కానీ ఈ కథ బైలింగ్వల్‌ చేసేందుకు బాగుంటుందని నమ్మి చేశానని వెల్లడించారు. 

నెక్ట్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందులో తాను బాలయ్య అభిమానిగా చేస్తున్నట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో స్పందించేందుకు నిరాకరించారు రామ్‌. నెక్ట్స్ హరీష్‌ శంకర్‌, అనిల్ రావిపూడి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఫైనల్‌ కాలేదన్నారు. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!