షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో..?

Published : Jul 12, 2022, 02:24 PM IST
షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో..?

సారాంశం

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేయబోతుననాడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ. ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరోను రంగంలోకి దింపబోతున్నాడట. మరి ఇందులో నిజం ఎంత..?   

 ఏ.ఆర్ మురుగదాస్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేసి.. రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు అట్లీ.. ఫస్ట్ సినిమాతోనే ఆయ‌న్నే బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ను కొట్టాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా ధళపతి విజ‌య్‌తో పోలీసోడు, అదిరింది, విజిల్ లాంటి హిట్ల‌తో కోలీవుడ్‌  స్టార్ డైరెక్టర్ల  జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ చేరి.. అక్కడ బాద్ షాతోనే సినిమా చేస్తున్నాడు అట్లీ. 

ఇక కరోనా నేపథ్యమో.. లేకు బాలీవుడ్ ఆరాటమో తెలియదు కాని.. అట్లీ నుంచి సినిమా వ‌చ్చి మూడేళ్ళ‌యింది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో జ‌వాన్‌ తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నయనతార ఈమూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా నయన్ పెళ్ళిలో షారుఖ్ అట్లీ సందడి చేశారు కూడా. ఇక రీసెంట్ గా జవాన్ నుంచి విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఆడియన్స్ నుంచి భారీగా  స్పంద‌న వ‌చ్చింది. 

ఇక  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మ‌రో స్టార్ హీరో క‌నిపించ‌బోతున్నాడు. షాక్ ఖాన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం అట్లీ స్టార్ హీరోను రంగంలో దింపుతున్నాడు. తమిళ స్టార్ హీరో విజ‌య్ ఈ మూవీలో లో గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్నాడు. ఈయ‌న పాత్ర 5 నిమిషాలు ఉండ‌నుంద‌ని టాక్. అంతేకాకుండా క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర విజ‌య్‌ద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 

అట్లీ ఇప్పటికే విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. దాంతో అట్లీ మీద ఉన్న అభిమానంతో విజయ్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో  షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నాడు. హీరోయిన్ పాత్రలో  న‌య‌న‌తార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీస‌ర్‌గా కనిపించబోతోంది. బాలీవుడ్ భామ సాన్య మ‌ల్హోత్రా కూడా జావాన్ లో  కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ స్వయంగా నిర్మిస్తున్నారు.   వ‌చ్చే ఏడాది జూన్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌