
గంగవ్వ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కనీస విద్యార్హత లేని గంగవ్వ సెలబ్రిటీ రేంజ్ కి వెళ్లడం ఎవరూ ఊహించనిది. యూట్యూబ్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. ఆమె లోని ప్రత్యేకత గమనించిన కొందరు యువకులు మై విలేజ్ షో పేరిట వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ షోకి వెళ్లారు.
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ ఇంకా పాపులరీ తెచ్చుకున్నారు. ఆమెకు ప్రేక్షకులు చాలా మద్దతు ఇచ్చారు. గంగవ్వ షోలో తన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే అనారోగ్య కారణాల చేత ఆమె మధ్యలోనే బయటికి వచ్చేశారు. ఆమె విజ్ఞప్తి మేరకు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపేశారు. ఐతే హోస్ట్ నాగార్జున ఆమెకు కొత్త ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చారు. గంగవ్వ ఏడాది క్రితం నూతన గృహప్రవేశం చేశారు.
కాగా ఆమె సినిమాల్లో కూడా ఫేమస్ అయ్యారు. కొన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. ఐతే ఆమెకు షూటింగ్స్ లో క్యారవాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. క్యారవాన్ అనుభవం తెలియజేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఓ మోస్తరు నటులకు కూడా క్యారవాన్ సౌకర్యం ఇవ్వరు. అలాంటిది నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ప్రత్యేకంగా మారింది.