Chiranjeevi Bhola Shankar : భళా... భోళా శంకర్.. ఫస్ట్ లుక్ తో రఫ్ ఆడించిన మెగాస్టార్..

Published : Jan 01, 2022, 12:11 PM IST
Chiranjeevi Bhola Shankar : భళా... భోళా శంకర్.. ఫస్ట్ లుక్ తో రఫ్ ఆడించిన మెగాస్టార్..

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇచ్చారు. నూతన సంవత్సరం కానుకగా భోళా శంకర్ మూవీ నుంచి  ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఆడియన్స్ కు హ్యాపీ న్యూయర్ చెప్పారు.

వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కు ఉండగా.. మలయాళ లూసీఫర్ రీమేక్ గాఢ్ ఫాదర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తుంది. ఇక మెహార్ రమేష్ డైరెక్షన్ లో తమిళ మూవీ వేదాళం కు రీమేక్ గా భోళా శంకర్ మూవ చేస్తున్నాడు చిరు. ఆ మధ్య టైటిల్ తో పాటు కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్ర చేస్తున్నట్టు వీడియో కూడా రిలీజ్ చేశారు టీమ్. ఇక ఇప్పుడు మరో మాస్ ట్రీట్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్భంగా భోళా శంకర్ సినిమా నుంచి మెగాస్టార్ మాస్ లుక్ తో కూడిన చిన్న వీడియోను రిలీజ్ చేవారు టీమ్. ఆడియన్స్ కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. చేతికి కలర్ దారాలు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో.. నల్ల కళ్ళజోడు పెట్టుకుని మెగా మార్క్ లుక్ తో కనిపిస్తున్నాడు చిరంజీవి.

 

న్యూ ఇయర్ కానుకగా స్వాగ్ ఆఫ్ భోళా అంటూ 18 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు టీమ్. ఈమూవీ షూటింగ్ ఈ మధ్యే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. సెకండ్ షెడ్యూల్ ను ఈనెలలో స్టార్ట్ చేయబోతున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

Also Read : RRR Postpone:'ఆర్ ఆర్ ఆర్' వాయిదా,ఈ రోజే ఎనౌన్సమెంట్?

 మెహర్ రమేష చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇక ఈమూవీకి  మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకి కీర్తి సురేశ్  సోదరిగా కనపడ‌నుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం టీమ్ కలకత్తా వెళ్ళనున్నారని తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే