ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ కు కొదవలేదు. కొన్ని కొన్ని నిజాలు కూడా నిజంగా ఇది రూమరేమో అనిపించేలా షికారు చేస్తుంటాయి. అయితే ఈ మధ్య ఓ సినిమా న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.
ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ కు కొదవలేదు. కొన్ని కొన్ని నిజాలు కూడా నిజంగా ఇది రూమరేమో అనిపించేలా షికారు చేస్తుంటాయి. అయితే ఈ మధ్య ఓ సినిమా న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.
అల్లు అర్జున్ హీరోగా వేణూ శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ టైటిల్ తో అప్పట్లో సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు. కాని ఈ సినిమా సెట్స్ వరకూ వెళ్లలేదు. ప్రీ ప్రొడక్షన్ తోనే ఆగిపోయింది. ఫస్ట్ లో ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన అల్లు అర్జున్.. ఆ తరువాత ఎందుకో ఈ సినిమా వైపు చూడలేదు. బన్నీతో ఈ సినిమా చేయించాలని దిల్ రాజు విశ్వ ప్రయత్నం చేశాడు . కాని కరోనా కారణాలు.. అల్లు అర్జున్ పుష్ప వైపు మళ్ళడంతో ఐకాన్ మీద అంతగా దృష్టిపెట్టలేదు.
ఈలోపు దిల్ రాజు వేణూ శ్రీరామ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తెరకెక్కించారు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ టైమ్ లో కూడా ఐకాన్ సినిమా చేస్తామంటూ.. అది కూడా బన్నీతోనే చేస్తామంటూ దిల్ రాజు ప్రకటించారు. కాని పుష్ప సినిమా అయిపోయి చాలా కాలం అవుతున్నా ఇంత వరకూ ఐకాన్ పై క్లారిటీ రాలేదు. ఈ సినిమాను చేసే ఉద్యేశ్యం అల్లు అర్జున్ కు లేదు అన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత బోయపాటి తో సినిమా రెడీగా ఉంది. ఆతరువాత కూడా అల్లు అర్జున్ చేయబోయే సినిమాల పై క్లారిటీతో ఉన్నాడు. దాంతో అల్లు అర్జున్ ఇప్పట్లో ఐకాన్ చేసే ఆలోచనలో లేనట్టుగా తెలిసిపోతోంది. అందుకే ఈ కథతో వేరే హీరోను పెట్టి సినిమా చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. అందకే ఐకాన్ కథను రామ్ తో చేస్తే బాగుంటుందని భావించారట.
రీసెంట్ గా రామ్ కు కథను వినిపించడం కూడా జరిగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఈ స్టోరీపై రామ్ ఇంట్రెస్ట్ గా ఉండటంతో.. కథను రామ్ తగ్గట్టు మార్పులు చేయడంపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు లింగ్ స్వామి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈసినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా తరువాత రామ్ బోయపాటితో సినిమా చేయబోతున్నాడు. అటు బన్నీ పుష్ప2 కంప్లీట్ చేసేలోపు.. బోయపాటి రామ్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బోయపాటి సినిమా కూడా పూర్తయిన తరువాత రామ్ ఐకాన్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమాను స్రవంతి బ్యానర్ తో కలిసి దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.