Shanmukh Jaswanth Met Surya : షణ్ముఖ్ జశ్వంత్ రెండేండ్ల కల నెరవేరింది.. సూర్యను చూడగానే ఎమోషనల్ అవుతూ..

Published : Mar 04, 2022, 04:37 PM IST
Shanmukh Jaswanth Met Surya : షణ్ముఖ్ జశ్వంత్ రెండేండ్ల కల నెరవేరింది.. సూర్యను చూడగానే ఎమోషనల్ అవుతూ..

సారాంశం

య్యూటూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేం షన్ముష్ జశ్వంత్ (Shanmukh Jaswanth) కల నెరవేరింది. తమిళ యాక్టర్ సూర్య (Surya)ని కలవాలనే కోరికను ఎట్టకేళలకు నేరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా పట్టలేనంత సంతోషంతో ట్విట్టర్ లో సూర్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.   

య్యూటూబ్ లో చిన్నచిన్న ఫన్నీ వీడియోలతో తన కేరీర్ ని ప్రారంభించిన షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth) బిగ్ బాస్ ఎంట్రీతో చిన్నపాటి హీరో స్థాయికి చేరుకున్నాడు. ‘సూర్య’ వెబ్ సిరీస్ తో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్ లో మరిన్ని మూవీ ఆఫర్లు వస్తున్నా వాటికి నో చెప్పాడంట షణ్ముఖ్. ప్రస్తుతం ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరిస్ టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే షణ్ముఖ్ ఎప్పటి నుంచో తమిళ హీరో సూర్యకు డైహార్డ్ ఫ్యాన్స్. సూర్యకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఫాలోఅవుతూ, ఏ చిన్న స్పెషల్ డే ఉన్నా సూర్యకు విషెస్ తెలుపుతూ వస్తుంటాడు. అయితే రెండేండ్ల కింద ‘సూర్యను కలిసే రోజు ఎప్పుడొస్తుందో’ అని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో రాశాడు. ఎట్టకేళలకు నిన్న షణ్ముఖ్ జశ్వంత్ కల నెరవేరింది.  హైదరాబాద్‌లో జరిగిన ‘ఈటీ’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లాంచ్‌కు హాజరైన సూర్యను షణ్నుచివరికి కలిశాడు. తన హీరోను నేరుగా చూసిన షణ్ముఖ్ కొంత ఎమోషనల్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక.. సూర్యనే చూస్తూ ఉన్నాడు. ఇంతలో సూర్య షణ్ముఖ్ వద్దకు వచ్చి తన గుండెకు హత్తుకున్నాడు. దీంతో షణ్ముఖ్ కు చాలా సంతోష పడ్డాడు.  

 

ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘మార్చి 3 చాలా సంతోషకరమైన రోజు. కొన్ని నెలలుగా ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూసిన నేను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు, మనోజ్‌లకు ధన్యవాదాలు, ఐ లవ్‌ యూ సూర్య అన్న’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు. నువ్వు కోరుకుంది జరగకపోవచ్చేమో కానీ నీకు కావాల్సింది తప్పకుండా జరిగి తీరుతుంది అని మరో వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్. మరోవైపు జశ్వంత్ సపోర్టర్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ వారూ ఆనంద పడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ