పూజా హెగ్డేతో కిస్సింగ్ సీన్.. ప్రభాస్ కష్టాలు అన్నీఇన్నీ కావుగా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 04, 2022, 04:14 PM IST
పూజా హెగ్డేతో కిస్సింగ్ సీన్.. ప్రభాస్ కష్టాలు అన్నీఇన్నీ కావుగా..

సారాంశం

రాధే శ్యామ్ చిత్రంలో కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ప్రభాస్ తెలిపాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. కాబట్టి కొన్ని కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్ తప్పకుండా ఉంటాయి. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 

తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్ర ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాధే శ్యామ్ చిత్రంలో కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ప్రభాస్ తెలిపాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. కాబట్టి కొన్ని కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్స్ సీన్స్ తప్పకుండా ఉంటాయి. 

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కిస్ సీన్స్ అవాయిడ్ చేసే చాన్స్ ఉంటుంది. కానీ ఇది లవ్ స్టోరీ తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి డైరెక్టర్ రాధాకృష్ణకు నేను నో చెప్పలేకపోయాను. పూజా హెగ్డేతో కిస్ సీన్స్ లో నటించాను. 

ఇక షర్ట్ తీసేసి ఓ రొమాంటిక్ సీన్ లో నటించాలి. అప్పుడు చాలా సిగ్గుగా అనిపించింది. ఆ టైంలో సెట్స్ లో ఎంత మంది ఉన్నారు అని లెక్కబెట్టుకున్నాను. చాలా మంది ఉన్నారు. దీనితో రాధాకృష్ణ మరో లొకేషన్ లో చేద్దాం పద ఈ సీన్ అని చెప్పాను అంటూ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. ఛత్రపతి సినిమాలో రాజమౌళి తనచేత షర్ట్ విప్పించారని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ