రేవంత్‌రెడ్డిని లయన్ తో పోల్చుతూ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వర్మ షాకింగ్‌ ట్వీట్‌

Published : Jun 26, 2021, 09:10 PM ISTUpdated : Jun 26, 2021, 09:11 PM IST
రేవంత్‌రెడ్డిని లయన్ తో పోల్చుతూ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వర్మ షాకింగ్‌ ట్వీట్‌

సారాంశం

 తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధీష్టానం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో ఓ సెటైరికల్‌ ట్వీట్‌ వదిలాడు.

వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లు సెటైరికల్‌గా, చిత్ర విచిత్రంగా ఉంటాయి. అర్థమయ్యే వాళ్లకి ఒకలా, అర్థం కాని వారికి మరోలా, ఆయన అంటే నచ్చే వారికి పాజిటివ్‌గా, నచ్చని వారికి నెగటివ్‌గా ఉంటాయి. కానీ చాలా వరకు తనదైన స్టయిల్‌లో సెటైరికల్‌గా స్పందించడం వర్మ స్టయిల్‌. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధీష్టానం నిర్ణయించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొంత వరకు ఆనందం, మేజారిటీ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. 

ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టయిల్‌లో ఓ సెటైరికల్‌ ట్వీట్‌ వదిలాడు. రేవంత్‌రెడ్డిని సింహంతో పోల్చాడు. ఇతర నాయకుల్ని టైగర్స్ తో పోల్చాడు. కాంగ్రెస్‌ పార్టీ సూపర్‌ ఫెంటాస్టిక్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆయన చెబుతూ, `లయన్‌ రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఖరారు చేసి కాంగ్రెస్‌ పార్టీ చివరగా సూపర్‌ ఫెంటాస్టిక్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టైగర్స్  అన్ని సింహాన్ని చూసి భయపడతాయి` అని పేర్కొన్నాడు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన