ఐకాన్‌ స్టార్‌ `పుష్ప` సరికొత్త రికార్డ్.. ఇండియా వైడ్‌గా నెంబర్‌ వన్‌

Published : Jun 26, 2021, 07:30 PM ISTUpdated : Jun 26, 2021, 07:31 PM IST
ఐకాన్‌ స్టార్‌ `పుష్ప` సరికొత్త రికార్డ్.. ఇండియా వైడ్‌గా నెంబర్‌ వన్‌

సారాంశం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` చిత్రం సరికొత్త రికార్డుని సృష్టించింది. ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్ లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. 

అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా సరికొత్త రికార్డు ని సృష్టించింది. దేశం మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా జాబితాలో నిలిచింది. ఐఎండీబీ ప్రకటించిన `మోస్ట్ ఆంటిసిపేటెడ్‌ ఇండియన్‌ మూవీ` జాబితాలో నెంబర్‌ 1 స్థానంలో నిలించింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సైతం రికార్డులు సృష్టిస్తుంది. అది దాదాపు 75 మిలియన్స్ వ్యూస్‌ సాధించి టాలీవుడ్‌లో టాప్‌లో నిలిచింది. ఇప్పుడు మరో రికార్డ్ సాధించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్