స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ ఇంట పెళ్లి సందడి.. క్రికెటర్‌తో కూతురు వివాహం

Published : Jun 26, 2021, 06:30 PM IST
స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ ఇంట పెళ్లి సందడి.. క్రికెటర్‌తో కూతురు వివాహం

సారాంశం

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇంట పెళ్లి సందడి స్టార్‌ కాబోతుంది. తన కూతురు అదితి శంకర్‌ వివాహం చేయబోతున్నాడు. తమిళనాడుకి చెందిన క్రికెటర్‌ రోహిత్‌తో ఐశ్వర్య వివాహం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇంట పెళ్లి సందడి స్టార్‌ కాబోతుంది. తన కూతురు అదితి శంకర్‌ వివాహం చేయబోతున్నాడు. తమిళనాడుకి చెందిన క్రికెటర్‌ రోహిత్‌తో ఐశ్వర్య వివాహం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మ్యారేజ్‌ వేడుక రేపు ఆదివారం(జూన్‌ 27)న జరగబోతుందని సమాచారం. అందుకు పొల్లాచి వేదిక కాబోతుంది. అయితే కేవలం వంద మంది బంధుమిత్రులతోనే ఈ వివాహ వేడుక నిర్వహించాలని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అతికొద్ది మందితోనే ఈ వివాహ వేడుకకి ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 

దర్శకుడు శంకర్‌కి ముగ్గురు సంతాపం ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కూతుళ్లు  ఐశ్వర్య శంకర్‌, అదితి శంకర్‌, కుమారుడు అర్జిత్‌ శంకర్‌ ఉన్నారు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఐశ్వర్య మ్యారేజ్‌ చేయబోతున్నాడు. ఆమె డాక్టర్‌గా రాణిస్తున్నారు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అని తెలుస్తుంది. మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గానూ ఉన్నారట. గత నెలలో శంకర్‌ తల్లి మరణించిన విషయం తెలిసిందే. 

ఇక పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న శంకర్‌ ప్రస్తుతం `ఇండియన్‌2` చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇది వివాదాల్లో ఉంది. మరోవైపు రామ్‌చరణ్‌తో మరో పాన్‌ ఇండియా సినిమాని ప్రకటించారు శంకర్‌. దీంతోపాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో `అపరిచితుడు` రీమేక్‌ చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్