RGV: సీఎం జగన్‌ని `మహాబల్‌`గా మార్చిన రామ్‌గోపాల్ వర్మ.. బెగ్గింగ్‌ అంటూ సినీ పెద్దలకు చురకలు

Published : Feb 11, 2022, 11:08 AM ISTUpdated : Feb 11, 2022, 11:11 AM IST
RGV: సీఎం జగన్‌ని `మహాబల్‌`గా మార్చిన రామ్‌గోపాల్ వర్మ.. బెగ్గింగ్‌ అంటూ సినీ పెద్దలకు చురకలు

సారాంశం

రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ టికెట్ల విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. పేర్నినాని, ఏపీ సీఎం జగన్‌ టార్గెట్‌గా గత నెలలో ప్రశ్నల వర్షం కురిపించారు.కానీ సినీ పెద్దలపై ఘాటు వ్యాఖ్య చేశారు.

రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసిన సంచలనమే. ముఖ్యంగా ఆయన చేసే ట్వీట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వైరల్‌ అవుతుంటాయి. ఏపీలో సినిమా టికెట్ల విషయంలో నెలకొన్ని వివాదం, సమస్యపై రామ్‌గోపాల్‌ వర్మ సీరియస్‌గా స్పందించారు. జనరల్‌గా ఆయన సమస్యలపై సెటైరికల్‌గా స్పందిస్తుంటారు. ఫన్నీవేలోనే కామెంట్లు పెడుతుంటారు. కానీ ఏపీ టికెట్ల విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. పేర్నినాని, ఏపీ సీఎం జగన్‌ టార్గెట్‌గా గత నెలలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. 

అనంతరం చిరంజీవి.. సీఎం జగన్‌తో చర్చలు జరపడం, ఇప్పుడు గురువారం మరోసారి సినీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్‌, మహేష్‌, రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌నారాయణమూర్తి, పోసాని, అలీ, నిరంజన్‌రెడ్డిలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి బాటలు వేశారు. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే రానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అది కూడా సెటైరికల్‌గానే చెప్పడం విశేషం. 

ట్వీట్టర్‌ ద్వారా రామ్‌గోపాల్‌ వర్మ స్పందిస్తూ, నిన్న(గురువారం) ఏపీ సీఎంతో భేటి వీడియోని పంచుకుంటూ సూపర్‌, మెగా, బాహుబలి లెవల్‌ బెగ్గింగ్‌ వల్ల ఇది జరిగినప్పటికీ వైఎస్‌ జగన్‌ ఒమేగా స్టార్ అయి వారిని ఆశీర్వదించినందుకు సంతోషిస్తున్నా. సూపర్‌, మెగా, బాహుబలిని మించిన మహాబలులైన జగన్‌ని అభినందిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు వర్మ. 

అయితే ఇందులోనూ సినీ పెద్దలకు చురకలు అంటించారు. సూపర్‌ స్టార్‌, మెగాస్టార్‌, బాహుబలి లాంటి పెద్దలంతా వెళ్లి సీఎం జగన్‌ వద్ద బెగ్‌ చేశారని విమర్శించడం గమనార్హం. అయితే దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. వర్మ టార్గెట్‌గా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఏం చేతకానీ వాడివని విమర్శలు చేయడంతో ఇప్పుడు వర్మ ట్వీట్‌ వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే వర్మ కామెంట్‌ చేయడానికి కారణం తనకు ఆహ్వానం లేకపోవడమే అనే టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు మంత్రి పేర్నినానితో వర్మ చర్చలు జరిపారు. ఆయనతో తీవ్ర స్థాయిలో డిబేట్‌ చేశారు. ఒకానొక దశలో రామ్‌గోపాల్‌ వర్మనే ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారని అంతా ప్రశంసలు కురిపించారు. కానీ తీర  అసలు చర్చల టైమ్‌లో ఆయనకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేకపోవడం గమనార్హం. బహుశా వర్మ దీన్ని మనసులో పెట్టుకుని సినీ పెద్దలు బెగ్గింగ్‌ అంటూ విమర్శించి ఉంటారని అంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

శివకార్తికేయన్, కార్తీ లకు ఝలక్.. ఫ్లాప్ సినిమాలకు మరింత నష్టం
ప్రముఖ నటుడి వివాహేతర సంబంధంపై భార్య బోల్డ్ కామెంట్స్..అలాంటి మహిళలు నా భర్త లైఫ్ లోకి వస్తుంటారు, పోతుంటారు