
తమిళ,తెలుగులో అజిత్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్,మార్కెట్ ఉంది. ఆయన చేసే ఫైట్స్ కు, యాక్షన్ విన్యాసాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో అజిత్ తాజా చిత్రం కోసం అభిమానులు ఎదురుచూడటంలో వింతేముంది. ఈ క్రమంలోనే ‘వలిమై’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకున్నారు. కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో అజయ్ దేవగణ్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.
బైక్ ఛేజింగ్ సన్నివేశంతో మొదలయ్యే ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా సాగింది. అజిత్ సీబీసీఐడీ అధికారిగా, విలన్ పాత్రలో కార్తికేయ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. అజిత్, కార్తికేయ లుక్స్, వారు చెప్పిన డైలాగులు అందరికీ నచ్చుతున్నాయి. ఇక ఈ చిత్రంలో అజిత్, కార్తికేయ పోటాపోటీగా నటించినట్టు అర్దమవుతోంది. పవర్ ఉన్నది ఆడుకోవడానికి ప్రాణాలు తీయడానికే అని విలన్ అంటే.. పవర్ ఉన్నది ప్రాణాలు తీయడానికి అని హీరో అంటాడు. మొత్తానికి ఈ సినిమాలోని రేసింగ్ సీన్లు, బైక్ చేజింగ్ సీన్లు మాత్రం హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పాలి.
స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన చిత్రమిది. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించగా.. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ తొలిసారి విలన్‌గా కనిపించనున్నారు.
యోగిబాబు, సుమిత్ర వంటి అనేక మంది తారాగణం ఇతర పాత్రలను పోషించారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా నిర్మించారు. ఇందులో బైక్ రేస్ సాహసాలను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించినట్టు ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే నిరూపించింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.