Pawan Kalyan: మరో దర్శకుడికి మాటిచ్చిన పవన్ కళ్యాణ్...? అనౌన్స్ మెంట్ ఎప్పుడో...?

By Mahesh Jujjuri  |  First Published Feb 11, 2022, 8:02 AM IST

గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan). అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇటు సినిమాలు చేసుకుంటూనే.. నెక్ట్స్ సినిమాలను కూడాలైన్ లో పెట్టేస్తున్నారు పవర్ స్టార్.


గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan). అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇటు సినిమాలు చేసుకుంటూనే.. నెక్ట్స్ సినిమాలను కూడాలైన్ లో పెట్టేస్తున్నారు పవర్ స్టార్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దూకుడు మీద ఉన్నారు. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. దడదడలాడిస్తున్నాడు. ఫ్యాన్స్ కు గ్యాప్ లేకుండా ట్రీట్ ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన  భీమ్లా నాయక్ రిలీజ్ కు రెడీగా ఉంది. సాగర్ కె చంద్ర  డైరెక్ట్ చేసిన ఈమూవీ గురించి ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Latest Videos

ఇక ఆతరువాత క్రిష్ డైరెక్షన్ లో నటిస్తోన్న హరి హర వీరమల్లు పై దృష్టి పెట్టాడు పవన్(Pawan Kalyan). ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా 50పర్సంట్ కంప్లీట్ చేశాడు పవర్ స్టార్. మిగిలిన మూవీ కుడా త్వరగాకంప్లీట్ చేసి సమ్మర్ చివరి వరకూ రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. అందుకే ఫాస్ట్ గా మూవీని కంప్లీట్ చేయాడానికి ఏర్పాట్లు జరగుతున్నాయి. నెక్ట్స్ షెడ్యూల్ కి అవసరమైన సెట్స్ కూడా  సిద్ధమవుతున్నాయి. ఈ నెలలోనే మళ్లీ పవన్ (Pawan Kalyan) సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నారు. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న పవర్ స్టార్(Pawan Kalyan). నెక్ట్స్ సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అని డిసైడ్ అయ్యారు పవన్. హరీష్ శంకర్ తో సినిమా తరువాత  లైన్లో సురేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా పవన్ లైన్లో పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఈమధ్యే నిర్మాత బండ్ల గణేష్ కు కూడా ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడట పవన్(Pawan Kalyan).

ఇక ఈ సినిమాలు కాకుండా మాస్ మహారాజ్ Ravi Teja తో  ఖిలాడి సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ అండ్ ప్రోడ్యూసర్ టీమ్ తో పవర్ స్టార్ సినిమా ఉండబోతోందని టాక్ గట్టిగా వినిపిస్తుందట. ఖిలాడి డైరెక్టర్ రమేష్ వర్మ చెప్పిన లైన్ నచ్చడంతో స్టోరీ డెవలప్ చేయాల్సిందిగా పవర్ స్టార్ (Pawan Kalyan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఖిలాడిని తెరకెక్కించిన టీమే పవన్ సినిమాను కూడా నిర్మిస్తుందని న్యూస్ గట్టిగా షికారు చేస్తోంది.

click me!