'లక్ష్మీస్ ఎన్టీఆర్' షాకింగ్ బిజినెస్!

By Udaya DFirst Published Feb 24, 2019, 9:36 AM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పనైపోయిందనుకున్నారంతా. 'ఆఫీసర్' సినిమా తరువాత మార్కెట్ లో ఆయనకున్న క్రెడిబిలిటీ మొత్తం పడిపోయింది. ఇక వర్మ సినిమాలకు అంత సీన్ లేదనుకుంటున్న సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రాజెక్ట్ చేపట్టాడు. 

సినిమా ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. సినిమా ఫస్ట్ కాపీ చూసిన శివం సెల్యులాయిడ్ సంస్థ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులను కొనేశారు.

నిర్మాతకు బెస్ట్ ప్రైస్ ఇచ్చి హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్, కర్ణాటక, ఆంద్ర, నైజాం, సీడెడ్, తమిళనాడు ఇలా అన్ని ఏరియాల థియేటర్ హక్కులను తొమ్మిది కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ని బట్టి తక్కువ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేశారనిపిస్తుంది.

కానీ బిజినెస్ మాత్రం అన్ని విధాల చూసుకుంటే రూ.12 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను మార్చి 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

click me!