అమెరికా అధ్యక్షుడి మీదొట్టు.. ఆ వీడియోలో ఉంది తాను కాదంటున్న వర్మ

Published : Aug 23, 2021, 07:23 PM IST
అమెరికా అధ్యక్షుడి మీదొట్టు.. ఆ వీడియోలో ఉంది తాను కాదంటున్న వర్మ

సారాంశం

రామ్‌ గోపాల్‌ వర్మ మరో అమ్మాయితో బర్త్ డే పార్టీలో హంగామా చేశాడు. డాన్స్ చేస్తూ, కౌగిలించుకుంటూ వర్మ చేసిన రచ్చ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది.  ఈ వీడియోపై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. దీంతో మరో దుమారానికి తెరలేపాడు వర్మ.

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. ఆ మధ్య బిగ్‌బాస్‌ 4 బ్యూటీ అరియానాని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి దుమ్ములేపాడు. ఇటీవల ఆషురెడ్డిని అసభ్యకరమైన యాంగిల్‌లో ఫోటో తీసి వివాదం క్రియేట్‌ చేశాడు. తాజాగా ఆయన మరో అమ్మాయితో బర్త్ డే పార్టీలో హంగామా చేశాడు. డాన్స్ చేస్తూ, కౌగిలించుకుంటూ వర్మ చేసిన రచ్చ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. 

ఈ వీడియోపై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. `ఇది ఆయనకేం కొత్త కాదుగా, అమ్మాయిలు, హీరోయిన్లతో రచ్చ చేయడం ఆయనకు మామూలే` అని నెటిజన్లు చర్చించుకుంటున్న నేపథ్యంగా వర్మ అలాంటి వీడియో మరోకటి తన ట్వీటర్‌లో షేర్‌ చేసి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. `మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు` అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. 

ఈ వీడియోలో వర్మ `రంగీలా` మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్ల మీద పడటం, దెండం పెడుతూ ఆమె చుట్టూ తిరిగిన తీరు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇది మరింత దుమారం రేపుతుంది. ఇదిలా ఉంటే ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె ధన్ రాజ్ హీరోగా వస్తోన్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో `బుజ్జి ఇలా రా` యూనిట్ శనివారం ఆమె బర్త్ డే వేడుకను సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా మద్యం మత్తులో వర్మ రెచ్చిపోయాడు. వార్తల్లో నిలిచాడు. దీన్ని కూడా తన పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు వర్మ.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం