
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొందరు స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి విష్ చేశారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టిడిపి బాస్ చంద్రబాబు సైతం చిరంజీవిని విష్ చేశారు. కానీ ఏపీ సీఎం జగన్ చిరు బర్త్ డే సందర్భంగా కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కాకపోతే నేరుగా ఫోన్ చేసి అయినా విష్ చేసి ఉండవచ్చు. కానీ అది కూడా జరగలేదట.
చిరు బర్త్ డే ని జగన్ పూర్తిగా ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇటీవల జగన్, చిరంజీవి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరు సతీసమేతంగా జగన్ ఇంటికి వెళ్లారు. టాలీవుడ్ సమస్యలు చర్చించడానికి మరోసారి చిరు జగన్ ని కలిశారు.
ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నప్పటికీ జగన్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోవడం ఏంటనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇది జగన్ పొరపాటు కాదు అని సీఎంవో ఆఫీస్ తప్పిదం అని వైసిపి నేతలు అంటున్నారు. చిరు బర్త్ డే గురించి సీఎంవో జగన్ కి సమాచారం ఇవ్వలేదని అంటున్నారు.
ఏది ఏమైనా త్వరలో చిరంజీవి ఇండస్ట్రీ ప్రముఖులతో టాలీవుడ్ సమస్యలు చర్చించేందుకు జగన్ ని కలవబోతున్న సంగతి తెలిసిందే. పేర్ని నాని ద్వారా జగన్ చిరంజీవిని ఇటీవల ఆహ్వానించారు.