
కరోనా.. లాక్‌డౌన్ సమయంలో సినిమాలు లేక యూత్ అంతా వెబ్‌సిరీస్‌లు చూడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాగా పాపులరైన వెబ్ సిరీస్ ‘మనీ హైస్ట్’. ఒక ప్రొఫెసర్ ఓ టీమ్ తో కలిసి స్పెయిన్‌లోని రాయల్ మింట్‌లో ఎలా దోపిడీ చేశాడన్నది కథ. స్పానిష్‌లో ‘లా కాస డె పాపెల్’ పేరుతో 2017లో తీసిన ఈ వెబ్‌సిరీస్.. ఇంగ్లీష్‌లో ‘మనీ హైస్ట్’ పేరుతో డబ్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తే భారీగా సక్సెస్ అయ్యింది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌కు లాక్‌డౌన్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. బ్యాంకులను దోచేసే కథాంశంతో విజయవంతంగా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్ ఐదో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సీజన్-5 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారటంలో సందేహం లేదు. ఇప్పటికే సీజన్- 5 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్-5, వాల్యూమ్ 1ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళ్, హిందీలో ఈ సీజన్‌ను రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సీజన్ కు ప్రమోషన్ డిఫరెంట్ గా చేయాలని దాంతో ఇండియన్ మార్కెట్ ని గ్రాబ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అందుకోసం ‘జల్దీ ఆవో’ అంటూ ఓ ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ‘త్వరగా రావచ్చు కదా’ అనే అర్దంలో వీడియోలో సాంగ్ సాగుతుంది.
ఈ వీడియోలో రానా, శ్రుతిహాసన్, హార్దిక్ పాండ్యా, అనిల్ కపూర్, రాధికా ఆప్టే, వెబ్ సిరీస్‌కు సంగీతం అందించిన న్యూక్లెయా ఉన్నారు. మొత్తం వీడియో అంతా ప్రత్యేకంగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం షూట్ చేసినట్లుగా ఉంది. ఈ సీజన్‌తో వెబ్‌సిరీస్ ముగుస్తుందని అంటున్నారు. ప్రతిసారి ఎస్కేప్ ప్లాన్‌ను రెడీగా ఉంచుకునే ప్రొఫెసర్, ఈసారి ఏ ప్లాన్‌లేక ఇరుక్కుపోవడంతో… ఇదే ఆఖరి సీజన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అదెలా ఉన్నా..రానా, శ్రుతి ఉన్న ఈ ప్రమోషనల్ వీడియోని మీరూ చూసేయండి.
మరో ప్రక్క మనీ హైస్ట్ వెబ్‌సిరీస్‌ను పాకిస్థాన్ వర్షెన్‌లో ‘50 క్రోర్’ పేరుతో సినిమాగా తీసారు. ఇందులో పాక్ నటులు ఖురేషి, మహమూద్ అస్లాం, అయిజాజ్ అస్లాం, సబూర్ అలి, ఫర్యాల్ మహమూద్, ఝాలే సారాది, అసద్ సిద్ధిఖి, నొమన్ హబీబ్, నవీద్ రజా, ఒమర్ షాహజద్, అనౌషే అబ్బాసి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ నటులు ‘50 క్రోర్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. దీంతో ‘మనీ హైస్ట్’ చూసిన నెటిజన్లు ‘50 క్రోర్’ సినిమాను ట్రోల్ చేసారు.