హైదరాబాద్‌ మేయర్‌పై ఆర్‌జీవీ సంచలన కామెంట్‌.. వచ్చే జన్మలో కుక్కలాగా పుట్టాలనుందట..

Published : Mar 04, 2021, 11:32 AM IST
హైదరాబాద్‌ మేయర్‌పై ఆర్‌జీవీ సంచలన కామెంట్‌.. వచ్చే జన్మలో కుక్కలాగా పుట్టాలనుందట..

సారాంశం

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కకి ఆహారం తినిపిస్తుంది.  అయితే ఇందులో తన కుక్కకి కుడిచేతితో తినిపిస్తూ, తాను మాత్రం ఏడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది.

రామ్‌గోపాల్‌ వర్మ  హైదరాబాద్‌ నగర మేయర్‌ని టార్గెట్‌ చేశాడు. ఆమె పంచుకున్న ఓ వీడియోని షేర్‌ చేస్తూ కుక్కల్ని ప్రేమించే మేయర్‌, ప్రజలని కూడా కుక్కల్లానే ప్రేమిస్తుందా? అంటూ విమర్శలు గుప్పించాడు. అంతేకాదు తాను కూడా వచ్చే జన్మంటే ఉంటే కుక్కలాగా పుట్టాలని ఉందని, ఆ మేయర్‌ ప్రేమని పొందాలని ఉందని సంచలన కామెంట్‌ చేశారు. ఇంతకి ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కకి ఆహారం తినిపిస్తుంది. 

అయితే ఇందులో తన కుక్కకి కుడిచేతితో తినిపిస్తూ, తాను మాత్రం ఏడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది. దీంతో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. సంచలన కామెంట్లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ, `సెల్ఫ్‌ లెస్‌ లవ్‌కిది నిదర్శనం. హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయ్‌లక్ష్మీ కుడి చేతితో కుక్కకి తినిపిస్తూ, తాను మాత్రం ఎడమ చేతితో తింటుంది. ఆమెని ఇంటర్నేషనల్‌ మేయర్‌ని చేయాలి` అంటూ దెండం పెట్టాడు వర్మ. 

అంతటితో వదల్లేదు. ఆమెపై విమర్శలు గుప్పించారు. `గద్వాల్‌ విజయలక్ష్మీ తాగి ఇలా కుక్కపై ప్రేమని చూపిస్తుందా, లేక కుక్క తాగిందా అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలానే ఆమె ప్రజలను ప్రేమిస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. మేయర్‌ ఇలాంటి ప్రేమని నాపై కురిపిస్తానంటే నేను వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలని  ప్రార్థిస్తున్నా` అని పేర్కొన్నాడు. ఇది చూసి ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ, కేటీఆర్‌, కేసీఆర్‌ కచ్చితంగా అసూయపడతారని కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, వర్మ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు