గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌.. బేబీ శ్రేయాదిత్య కోసం వెయిటింగ్‌..

Published : Mar 04, 2021, 10:12 AM IST
గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌.. బేబీ శ్రేయాదిత్య కోసం వెయిటింగ్‌..

సారాంశం

పాపులర్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అయ్యారు. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

పాపులర్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అయ్యారు. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. తన ఆనందాన్ని పంచుకుంది. `బేబీ శ్రేయాదిత్య రాబోతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు శిలాదిత్య, నేను చాలా థ్రిల్‌ అవుతున్నాం. మా జీవితంతో కొత్త ఆధ్యాయానికి ప్రిపేర్‌ కావడానికి మీ అందరి ప్రేమ, బ్లెస్సింగ్స్ కావాలి` అని శ్రేయా ఘోషల్‌ ట్వీట్‌ చేసింది. 

ఈ సందర్బంగా గర్భంతో ఉన్న తన ఫోటోని పంచుకుంది. దీనికి అభిమానులు, సినీ వర్గాలు స్పందిస్తూ, ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇండియన్‌సింగర్‌గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్‌ సింగర్‌గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు. వెస్ట్ బెంగాల్‌ కి చెందిన ఈ అందాల సింగర్‌ బిజినెస్‌ మ్యాన్‌ అయిన శిలాదిత్యని 2015లో వివాహం చేసుకుంది.  ఆరేళ్ల తర్వాత వీరి జీవితంలోకి మూడో వ్యక్తికి చోటు కల్పించారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల `ఉప్పెన` చిత్రంలో `జల జల జలపాతమ్‌.. `అనేపాటని ఆలపించారు. ప్రస్తుతం `టక్‌ జగదీష్‌`లో ఇంకోసారి.. ఇంకోసారి` అనే పాటని ఆలపించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం