పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చాలా స్పీడుగా ఉన్నారు. కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చిన ఆయన ఒక్కసారిగా జెట్ వేగంతో ప్రయాణిస్తున్నారు. రీసెంట్ గా 'వకీల్‌సాబ్' సినిమా పూర్తి చేసి..వెంటనే రెండు సినిమాలను ట్రాక్ ఎక్కించేశారు. అందులో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి. ఈ సినిమాని ఓ ప్రక్క క్రిష్, మరో ప్రక్క క్రిష్ స్నేహితుడు అయిన మరో దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా డైరక్ట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పెద్ద సినిమాలకు ఇలా ఇద్దరు డైరక్టర్స్ పనిచేయటం సహజంగా జరుగుతూంటుంది. అయితే ఈ విషయాలను అఫీషియల్ గా రివీల్ చేయరు. రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాల సెకండ్ యూనిట్‌ను ఆయన కుమారుడు కార్తికేయ డైరెక్ట్ చేస్తుంటాడు.

క్రిష్ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కు ఇచ్చేయాల్సి ఉంది. కాబట్టి సినిమా షూటింగ్ ను రెండు యూనిట్స్‌గా విభజించి చేయాలని నిర్ణయంచారు. అందులో పవన్ కళ్యాణ్ ఉండే సీన్స్ కు డైరెక్టర్ క్రిష్ సారథ్యం వహిస్తే.. మరో యూనిట్‌కు ఈ మధ్యనే వచ్చిన రొమాంటిక్ చిత్రం.., కమిట్‌మెంట్ దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా సారథ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చిత్రం కథాంశం...మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి కాలానికి చెందిన పీరియాడిక్ స్టోరీగా సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌కల్యాణ్ పేద ప్రజలకు అండగా నిలిచే రాబిన్ హుడ్ లాంటి బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఛార్మినార్ సెట్, గండికోట సంస్థానం సెట్ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట మేకర్స్. ‘ఆక్వామెన్’, ‘స్టార్ వార్స్ ఎపిసోడ్ VII-ది ఫోర్స్ అవేకన్స్’, ‘వార్‌క్రాఫ్ట్’ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ఈ సినిమాకి పనిచేస్తున్నారని టాక్.