‘కుక్కల మేయర్’ సాంగ్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ‘పాపం ఎవరిది మేయర్?’ అంటూ ఆర్జీవీ ప్రశ్నలు

By Asianet News  |  First Published Mar 11, 2023, 11:14 PM IST

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ  (Ram Gopal Varma) హైదరాబాద్ మేయర్ ను ఉద్దేశిస్తూ తాజాగా ఓ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం అది  నెట్టింట వైరల్ గా మారింది.
 


టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు అప్డేట్స్, ఇంటర్వ్యూలు, ట్వీట్లు ఏదైనా క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి.  అదే క్రమంలో ఆర్జీవీ సైతం సోషల్ అంశాలపైనా క్షణాల్లో స్పందిస్తుంటారు. తనదైన పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశోధిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.  ఇక రీసెంట్ గా హైదరాద్ లోని అంబర్ పేట కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

నాలుగేండ్ల బాలుడిని వీధికుక్కలు దాడిచేసి చంపడంతో ఆర్జీవీ తట్టుకోలేకపోయారు. వెంటనే ట్వీటర్ వేదికన స్పందిస్తూ.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ బాధ్యత వహించాలని పోరాడుతున్నారు. ఈ ఘటనపై మేయర్ నిర్లక్ష్యపు కామెంట్లు చేయడంతో ఆర్జీవీ పోరాటం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో అందరినీ ఏకం చేసేందుకు ట్వీట్లు  పెడుతూనే ఉన్నారు. ఇక  తాజాగా ‘కుక్కల మేయర్’ అనే టైటిల్ తో ఓ సాంగ్ ను కూడా విడుదల చేశారు. పాట రూపంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీని  కడిగిపారేశారు. 

Latest Videos

తాజాగా విడుదల చేసిన సాంగ్ కు తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ పాడారు. తన ప్రశ్నలంటినీ పాటరూపంలో పాడి వినిపించారు. కొద్దిసేపటి కింద యూట్యూబ్ లోనూ విడుదల చేయడంతో నెట్టింట వైరల్ గా మారుతోంది. సాంగ్ లో ‘అడుక్కున్న పన్నులన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్’ అంటూ మేయర్ ను మరోసారి ఇలా ప్రశ్నించారు.

అంబర్ పేట వీధి కుక్కల ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. రెండు నెలలో కుక్కల బెడదల లేకుండా చూస్తామని హామీనిచ్చింది. బాలుడు ప్రదీప్ కుటుంబానికి కూడా అండగా ఉంటామని హామీనిచ్చింది. మరోవైపు సినీతారలు సైతం స్పందించారు. ఒక్కఘటనతో మూగజీవాలపై ద్వేషం పెంచుకోవద్దని  సూచిస్తున్నారు. వాటి నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకుంటూ సరిపోతుందని  అభిప్రాయపడుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

click me!