మార్చిలోనే విడుదల కాబోతున్న నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం నుంచి బ్యూటీఫుల్ ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) - యంగ్ హీరోయిన్ మాళవికా నాయిర్ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్నారు. నాగశౌర్య - శ్రీనివాస్ అవసరాల కాంబోలో గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మరో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' (PAPA)తో అలరించబోతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఈక్రమంలో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ట్రైలర్ లో.. నాగశౌర్య - మాళవికా నాయిర్ రొమాంటి్క్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. బ్యూటీఫుల్ లోకేషన్లలో యువత హ్రుదయాలను హత్తుకునే సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణంగా తెలుస్తోంది. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనేది ట్రైలర్ లో చూపించారు. 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేలా ఉంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయని అర్థవుతోంది. అన్ని కోణాల్లో ప్రేమను దర్శకుడు ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Cute & Loveable phalanala abbayi phalana ammayi Trailer Out Now😍
Watch Trailer Here👇https://t.co/cerznRTcWj pic.twitter.com/esX864ewSu