ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్’ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ కు డాన్స్ ఉంటుందని ప్రముఖ హాలీవుడ్ నటి లారెన్ గాట్లీబ్ (Lauren Gottlieb) తాజాగా తెలిపింది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ చేయడం లేదు.
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్ 2023’ వేడుక రేపు గ్రాండ్ గా అమెరికాలో జరగబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అయితే ‘ఆస్కార్స్’ వేదికపై RRR హిట్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu) మ్యూజికల్ పెర్ఫామెన్స్ ఉండబోతుందని ఇప్పటికే అకాడెమీ అనౌన్స్ చేసింది. దీంతో గల్లీబాయ్ రాహుల్ సింప్లిగంజ్, కాల బైరవ ప్రతిష్టాత్మకమైన వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ ను పాడి వినిపించబోతున్నారు.
ఈ క్రమంలో ‘నాటు నాటు’ సాంగ్ కు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరిగింది. ఫ్యాన్స్ ఎంతగానో ఖుషీ అయ్యారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు హీరోలు డాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దీనిపై తారక్ స్పందిస్తూ.. డాన్స్ పెర్ఫామెన్స్ కు అంత సమయం లేకపోవడంతో చేయడం లేదన్నారు. అప్పటికే అన్ని షెడ్యూళ్లు ఫిక్స్ అయ్యాయని క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ ఒకటి అందింది.
‘ఆస్కార్స్’ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ కు డాన్స్ ఉంటుందని తాజాగా హాలీవుడ్ నటి లారెన్ గాట్లీబ్ (Lauren Gottlieb)అనౌన్స్ చేసింది. ఆ సాంగ్ కు తానే వేదికపై పెర్ఫామ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఇందుకు ఆమె చాలా సంతోషిస్తున్నట్టు తెలిపింది. తనకు విష్ చేయమంటూ ఇన్ స్టా పోస్ట్ ద్వారా కోరింది. ఇప్పటికే రిహార్సల్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కొన్ని ఫొటలను పంచుకుంది. Ram Charan, NTRకు బదులుగా కనీసం లారెన్ అయిన పెర్ఫామ్ చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
95వ అకాడెమీ అవార్డుకు ‘నాటు నాటు’ సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. రేపటి ఆస్కార్స్ వేదికలో అవార్డు దక్కించుకుంటుందని అంతా ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే త్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక రేపటి వేడుక కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందిన విషయం తెలిసిందే.