మహాభారతంపై పిచ్చ క్లారిటీ ఇచ్చిన వర్మ.. ఈ సారి టార్గెట్‌ తెలంగాణ!

Published : Jan 18, 2021, 09:34 PM IST
మహాభారతంపై పిచ్చ క్లారిటీ ఇచ్చిన వర్మ.. ఈ సారి టార్గెట్‌ తెలంగాణ!

సారాంశం

వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. 

వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్‌గోపాల్‌ వర్మ  టీమ్‌ నుంచి ఓ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. 

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు వర్మ. ఇందులో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. `గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపతి, కొట్టాట పెట్టిన గోపాల్‌ యాదవ్‌ గాని కథ`  ఆధారంగా తీస్తున్న వెబ్‌ సిరీస్‌` అని పేర్కొన్నాడు వర్మ. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. చెవులు తెరచుకొని వినాలని, తాము తీయబోయే సినిమా టైటిల్‌లోనే క్లారిటీ ఇచ్చామని, ఇది మహాభారతం కాదని చెప్పాడు. అయితే మహాభారతం లాంటి సంఘటనలు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయని, మహాభారతం కంటే ముందు నుంచి జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తుల మధ్య మహాభారతం లాంటి సంఘటన చోటు చేసుకుంటే వాళ్లు ఏం చేశారనేది ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఇందులో భగవద్గీత తరహా అంశాలు చూపించబోతున్నట్టు పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు