`లడీ లడీ.. `సాంగ్‌ ఓవర్‌ నైట్‌ వారి ఫేట్‌నే మార్చేసిందిగా!

Published : Jan 18, 2021, 08:23 PM IST
`లడీ లడీ.. `సాంగ్‌ ఓవర్‌ నైట్‌ వారి ఫేట్‌నే మార్చేసిందిగా!

సారాంశం

అలాంటి క్రేజ్‌ రోహిత్‌ నందన్‌, ప్రియా ప్రకాష్‌ పొందుతున్నారు. వీరిద్దరు కలిసి ఇటీవల `లడీ లడీ` పేరుతో రూపొందించిన ప్రైవేట్‌ సాంగ్‌లో ఆడిపాడారు. శ్రీచరణ్‌ పాకాల కంపోజ్‌ చేసిన ఈ పాటని, బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని ఆలపించారు. ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ పాట ప్రస్తుతం విశేషంగా వైరల్‌ అవుతుంది.

సోషల్‌ మీడియా కారణంగా ప్రతిభ గల ఎవరైనా రాణించడం సాధ్యమవుతుంది. ఎక్కడో మూలకు ఉన్న వారికి కూడా డే అండ్‌ నైట్‌లో పాపులారిటీని తీసుకొస్తుంది. తాను పాడిన పాటని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఓవర్‌ నైట్‌లో ఆమె విపరీతమైనా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆమెని ఇంటికి పిలిపించుకుని అభినందించారు. అలాగే మలయాళ భామ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్నుగీటితో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఆమె కన్నుగీటికి అల్లు అర్జున్‌ సైతం ఫిదా అయ్యారు. 

ఇప్పుడు అలాంటి క్రేజ్‌ రోహిత్‌ నందన్‌, ప్రియా ప్రకాష్‌ పొందుతున్నారు. వీరిద్దరు కలిసి ఇటీవల `లడీ లడీ` పేరుతో రూపొందించిన ప్రైవేట్‌ సాంగ్‌లో ఆడిపాడారు. శ్రీచరణ్‌ పాకాల కంపోజ్‌ చేసిన ఈ పాటని, బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని ఆలపించారు. ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ పాట ప్రస్తుతం విశేషంగా వైరల్‌ అవుతుంది. ఇప్పటికే ఇది రెండు మిలియన్‌లకుపైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. మూడు మిలియన్స్ దిశగా దూసుకుపోతుంది. ఓ అప్‌కమింగ్‌ జోడి చేసిన ఈ పాటకి ఈ రేంజ్‌లో వ్యూస్‌ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

ఈ సంద‌ర్భంగా ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో స్టెప్పులేసిన కుర్రాడు రోహిత్ నంద‌న్ తన ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆద‌ర్శంగా తీసుకుని డాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపారు. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ `లడీ లడీ..` అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌లు ద్వారా ఈ ఆల్బ‌మ్ లోకి ఇంట‌ర్నెట్ సెన్షేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ ని, తీసుకున్నామ‌`ని అన్నారు. 

ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్ట్ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్రీ సీమ‌లోకి అడుగుపెట్టార‌ని, ఆమె ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగంద‌ని రోహిత్ తెలిపారు.  త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాని రోహిత్ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ పాటతో ప్రియా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్